రంగారెడ్డి

హాస్టల్‌లో తాగునీటి సంక్షోభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, ఫిబ్రవరి 14: తాండూరు శివారు రాజీవ్ గృహకల్ప కాలనీ సమీపంలో యాలాల మండల పరిధిలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులు గడచిన నెల రోజులుగా తాగునీటి కష్టాల పాలవుతున్నారు. తాగునీటి అవసరాల మాటలా ఉంచితే కనీసం సంక్షేమ వసతి గృహంలో కనీస అవసరాలు తీర్చుకునేందుకు సైతం నీళ్లు లేని దుస్థితిని ఎదుర్కుంటున్నట్లు గురుకుల పాఠశాల, జూనియర్ కాలేజీ విద్యార్థులు గురువారం యాలాల మండల రెవెన్యూ తహశీల్దార్ మల్లేష్ కుమార్ ముందు ఏకరువు పెట్టారు. ప్రభుత్వం పేద విద్యార్థుల సంక్షేమం, విద్యాభ్యున్నతికి ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వసతి గృహంలో గడచిన నెల రోజులుగా విద్యార్థులు 5వ తరగతి మొదలు ఇంటర్మీడియట్ వరకు చదివేవారు తమ అవస్థలను తహశీల్దార్‌కు వివరించారు. పాఠశాల ప్రిన్సిపాల్ అరుణ సమాచారం మేరకు వసతి గృహంలో తాగునీటి కష్టాలు రోజురోజుకూ ఉద్ధృతంగా మారుతున్నట్లు తెలిపారు. తాండూరు మున్సిపల్ కమిషనర్ పీ.్భగయ్యను సంప్రదించి రెండు మూడు రోజులకు ఒకసారి ట్యాంకర్లతో వసతిగృహంలో విద్యార్థుల అవసరార్థం తాగునీరు తెప్పించి వాడుకుంటున్నట్లు వివరించారు. కాగా ఈ వసతిగృహంలో దాదాపు 650 మందికిపైగా విద్యార్థులు, చిన్నారులు తాగునీరు ఇతరాత్ర అవసరాలకు నీరు లేకపోవడంతో నరకయాతనలు పడుతున్నట్లు పేర్కొంటున్నట్లు వెల్లడించారు. గురువారం తాండూరు చైల్డ్ లైన్ సిబ్బందికి అందిన సమాచారంతో చైల్డ్‌లైన్ సిబ్బంది వసతిగృహంలో తాగునీటి ఎద్దడి, విద్యార్థులు పడుతున్న అవస్థల గురించి యాలాల తహశీల్దార్ మల్లేష్ కుమార్‌కు వివరించగా వెంటనే డిప్యూటీ తహశీల్దార్ చాన్ పాషాతో కలిసి వచ్చి గురుకుల వసతిగృహాన్ని సందర్శించారు. తహశీల్దార్‌తో పాటు, చైల్డ్‌లైన్ సిబ్బంది వెంకటేష్.. వసతిగృహం విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు.
తహశీల్దార్ మల్లేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ స్పందించి వాటర్‌వర్క్స్ విభాగం అధికారులతో సంప్రదించి రెండు ట్యాంకర్ల తాగునీరు వసతి గృహానికి పంపించాలని సూచించారు. రెండు నెలలుగా వసతి గృహం విద్యార్థులు తాగునీటి అవసరాల కోసం ఇక్కట్ల పాలవుతున్నట్లు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ అరుణ తెలుపుతూ వసతిగృహం ఆవరణలో ఉన్న మూడు బోర్‌వెల్స్‌లో భూగర్భ జలాలు అడుగంటి పోయాయని, మిషన్ భగీరథ నీళ్లు సైతం అరకొరగా సరఫరా అవుతున్నట్లు తెలిపారు. ఈ వసతి గృహానికి సమీపంలో ఉన్న రాజీవ్ గృహకల్ప కాలనీ వద్ద ఉన్న పవర్ బోర్ల నుంచి వసతిగృహానికి తాగునీరు, విద్యార్థుల అవసరాలకు సరిపడా నీరు సరఫరా చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ అరుణ కోరారు.