రంగారెడ్డి

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేపీహెచ్‌బీకాలనీ, ఫిబ్రవరి 16: రోడ్డు ప్రమాదాల భారీన పడకుండా ద్విచక్ర వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని బాలాజీనగర్ డివిజన్ కార్పోరేటర్ పన్నాల కావ్య హరిష్‌రెడ్డి అన్నారు. శనివారం రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా హైదరాబాద్ టాటా స్ట్రయివ్ ఆధ్వర్యంలో బ్రాండ్ ఫ్యాక్టరి చౌరస్తా నుంచి కేపీహెచ్‌బీకాలనీ టెంపుల్ బస్టాప్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరై మాట్లాడుతూ కార్లు నడిపే వాహనదారులు తప్పని సరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నారు. వాహనదారులు ప్రమాదాలకు గురి కాకుండా తీసుకొవాల్సిన జాగ్రత్తలను, ట్రాఫిక్ రూల్స్ గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో టాటా స్ట్రయివ్ ఇండియా ఫ్రోగ్రాం డెవలప్‌మెంట్ హెడ్ సుధాకర్. రిజినల్ మేనేజర్ ప్రదీప్ లింగాయత్, సెంటర్ మేనేజర్ వినయ్, వార్డు కమిటీ సభ్యులు పట్లోళ్ల సాయినాథ్‌రెడ్డి, ఏరియా కమిటీ సభ్యులు ఎస్.కె.మహబూబ్, మెట్టు శ్రీను, రావెల్ షా, మహేష్, గోపాల్ చౌదరి, ఆర్.వి.సత్యనారాయణ పాల్గొన్నారు.
కార్మిక సంఘం అధ్యక్షుడు రామారావుకు లీగల్ సెల్ ప్రశంస
మెహిదీపట్నం, ఫిబ్రవరి 16: భవన నిర్మాణ, ఇతర రంగాల కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తున్న హైదరాబాద్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘంను హైద్రాబాద్ జిల్లా లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ అధికారులు ప్రశంసిస్తూ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. పారా లీగల్ వాలంటీర్‌గా వ్యవహరించిన భవన నిర్మాణ కార్మక సంఘం అధ్యక్షుడు పి. రామారావు ఈ ప్రశంసాపత్రాన్ని అథారిటీ సెక్రటరీ, జడ్జి సుదర్శన్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈసందర్భంగా రామారావు మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్మికులు పేర్లును నమోదు చేసుకోవాలని పిలుపు నిచ్చారు. అంతేకాకుండా కార్మిక శాఖ ఇచ్చే గుర్తింపు కార్డును తీసుకోవాలని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఘన సత్కారం
తాండూరు, ఫిబ్రవరి 16: ఉమ్మడీ రంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి మొదటి సారి హాజరయిన తాండూరు నూతన ఎమ్మెల్యే పంజుగుల పైలెట్ రోహిత్ రెడ్డికి శనివారం ఘన సత్కారం నిర్వహించారు. రంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జడ్పీ వైస్ చైర్మన్, జడ్పీ సీ ఈవో, అధికారులు రోహిత్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే హోదాలో మొదటి సారీ జడ్పీ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు.
ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడీ రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పి.సునీతా మహేందర్ రెడ్డి సహకారంతో తాండూరు పట్టణ,నియోజక వర్గం పురోభివృద్ధికి పూర్తి స్థాయిలో జడ్పీ నిధులు సేకరించి అభివృద్ధి, ప్రజాసంక్షేమ పథకాల అమలుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇక ముందు తమ పదవి కాలం పూర్తయ్యే వరకు తాండూరు నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు భారీ స్థాయిలో జడ్పీ నిధులు విడుదల చేసి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. ఉమ్మడీ రంగా రెడ్డి జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో నూతనంగా గెలుపోంది, మొట్ట మొదటి సారీ జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశానికి హాజరవుతున్న ఎమ్మెల్యేలు అందర్ని సగర్వంగా సత్కరించటం తమ బాధ్యత అని జడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.