రంగారెడ్డి

విద్యార్థులు క్రీడల్లో సైతం రాణించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఫిబ్రవరి 16: విద్యార్థులు క్రీడల్లో సైతం రాణించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఎం.ఆనంద్ అన్నారు. శనివారం పట్టణంలోని సెయింట్ జూడ్స్ పాఠశాలలో అండర్ 17 బాల బాలికల టెన్నికాయిడ్ 64వ జాతీయ స్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. పోటీలలో 10 రాష్ట్రాలకు చెందిన జట్లు తలపడనున్నాయి. పోటీలు 19వ తేదీ వరకు నిర్వహించనున్నాయి. ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ, జాతీయ స్థాయి పోటీలలో సైతం తెలంగాణ జట్టు విజయం సాదించేలా క్రీడాకారులు ప్రతిభ కనబర్చాలన్నారు. కార్యక్రమంలో పలు పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
నాలా పూడికతీత పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
బాలానగర్, ఫిబ్రవరి 16 : నాలా పూడికతీత పనులను ఎప్పటికప్పుడు చేపట్టాలని బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ కాండూరీ నరేంద్ర ఆచార్య అన్నారు. శనివారం డివిజన్ పరిధిలోని గీతానగర్, నవజీవన్‌నగర్‌లో నాలా పూడికతీత పనులను ఎఎం హెచ్‌ఓ చంద్ర శేఖర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నాలాలో చెత్త చెదారం వేయకుండా ప్రజలు, పారిశ్రామిక వేత్తలు సహకరించాలన్నారు. స్వచ్చ్ బాలానగర్ డివిజన్‌గా తీర్చిదిద్దడంలో పారిశుధ్య కార్మికులతో పాటు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండ ఆటో రిక్షాలొనే వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ వాసులు పాల్గొన్నారు.

తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ నిరంతర కృషి
షాబాద్, ఫిబ్రవరి 16: తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని మాజీ మంత్రి మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం షాబాద్ మండల పరిధిలోని ఎల్గొండగూడ, మక్తగూడ, తాళ్లపల్లి, సీతారాంపురం గ్రామాల్లో జిల్లా యువజన విభాగం అధ్యక్షునితో పాటు పర్యటించారు. తెలంగాణలో రైతులను రాజులను చేయాలనదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నక్క శ్రీనివాస్ గౌడ్, మండల అధ్యక్షుడు నర్సింగ్ రావు, సర్పంచ్‌లు కుమ్మరి దర్శన్, నరసింహా రెడ్డి, నాయకుడు శ్రీరాం రెడ్డి పాల్గొన్నారు.

ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 16: ప్రజలకు సుఖవంతమైన రవాణా కొరకు నాణ్యమైన రోడ్లను నిర్మిస్తున్నామని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శనివారం మియాపూర్ డివిజన్‌లోని ఆర్‌బీఆర్ కాంప్లెక్స్ నుంచి టాకీ టౌన్ వరకు నిర్మిస్తున్న వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ మేకా రమేష్‌తో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. నాణ్యతలో రాజీపడకుండా సకాలంలో పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ఇందులో టీఆర్‌ఎస్ నాయకులు మహేందర్ ముదిరాజ్, ఉప్పలపాటి శ్రీకాంత్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నార్నె శ్రీనివాస్, ఎం.ప్రసాద్, కాశీనాథ్, స్థానిక నాయకులు మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
సురక్షితమైన తాగునీటిని తాగాలి
కేపీహెచ్‌బీకాలనీ, ఫిబ్రవరి 16 : సురక్షితమైన తాగునీటిని తాగి ఆరోగ్యాలను కాపాడుకోవాలని బాలాజీనగర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల కావ్య హరిష్‌రెడ్డి అన్నారు. శనివారం డివిజన్ పరిధిలోని వివేక్‌నగర్‌లో సెఫ్టి వాటర్ నెట్ వర్క్ , హానీ వెల్ సంస్థల ఆధ్వర్యంలో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 3 నుంచి 5వ తరగతి విద్యార్థులకు తాగునీటి గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై శుద్ది చేసిన మంచినీటిని తాగడంతో కలిగే లాభాలను, వర్షం నీరు సంరక్షణపై అవగాహన కల్పించారు. ప్రతిఒక్కరు నీటిని వృదా చేయకుండా కాపాడుకొవాలన్నారు. అరవింద్, బాలిశ్వర్, వేణు, వేదాంత్, భాష్యం ఉపాధ్యాయులు శారద, ప్రత్యూష, శోభ, ఆకుల నగేష్, సురేష్‌గౌడ్‌లు పాల్గొన్నారు.