రంగారెడ్డి

త్వరలో పార్లమెంట్ ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఫిబ్రవరి 16: త్వరలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికలతో పాటు.. అసెంబ్లీ ఎన్నికలు సైతం జరిగే అవకాశం ఉందని చేవెళ్ల ఎంపీ కొండా విశే్వశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ నివాసంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. మాట్లాడుతూ.. గడిచిన అసెంబ్లీ ఎన్నికలు గందరగోళంగా జరిగాయి అనే దానికి నిదర్శనం.. ప్రసాద్‌కుమార్ ఓటమి అని చెప్పవచ్చని అన్నారు. ప్రసాద్‌కుమార్ ఓటమి చెందారు అంటే.. ఇప్పటికీ నమ్మలేక పోతున్నామన్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ట్యాంపరింగ్ జరిగిందా.. లేదా అనే విషయాన్ని పక్కన పెడితే.. ఒక ఇంజనీర్‌గా ట్యాంపరింగ్ సాధ్యమేనని చెప్పగలనని పేర్కొన్నారు. మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ, గడిచిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంల వీవీ ప్యాట్‌లు లెక్కించినట్లైతే ఓటమి పాలైన 36 మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా అయ్యే అవకాశం ఉందని అన్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల గందరగోళంపై రెండు కేసులు కోర్టులో వేశారని, మళ్లి ఎన్నికలు రావడమో.. నేరుగా ఎమ్మెల్యే కావడం వంటిది కోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ విశే్వశ్వర్ రెడ్డిని విమర్శించే స్థాయి చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్యకు లేదని అన్నారు. విశే్వశ్వర్‌రెడ్డి రాజకీయాల్లోకి రాక ముందు నుంచే యువతకు ఉపాధి అవకాశాలు చూపాడని గుర్తు చేశారు. ప్రస్తుతం జిల్లాలో టీఆర్‌ఎస్ పరిస్థితి దయనీయంగా ఉందని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో విశే్వశ్వర్‌రెడ్డికి పోటీగా టీఆర్‌ఎస్ అభ్యర్థులు నిలబడలేని అయోమయం స్థితిలో ఉన్నారని ఆరోపించారు. సమావేశంలో కాంగ్రెస్ ఏ-బ్లాక్ అధ్యక్షుడు అనంత్ రెడ్డి, బీ-బ్లాక్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, నాయకులు నర్సిములు, శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, మురళి, విజయ్ ఉన్నారు.