రంగారెడ్డి

గ్రామాభివృద్ధికి సర్పంచే అత్యంత కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తలకొండపల్లి, ఫిబ్రవరి 18: మారుమూల ప్రాంతలైన గ్రామాలు అభివృద్ధి చెందాలంటే, గ్రామ అభివృద్ధికి తొలిమెట్టు లాంటి వాడు గ్రామ సర్పంచే అని ఆమనగల్లు సీఐ నర్సింహ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండలానికి చెందిన చుక్కాపూర్ గ్రామంలో సోమవారం నూతనంగా ఏర్పాటు చేసిన కూరగాయల సంతను ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా హాజరై సంత ఏర్పాటుకు ప్రత్యేక పూజలు చేసి ఘనంగా ప్రారంభించారు. ఘనంగా పూలమాలలు శాలువాలతో సీఐ నర్సింహ రెడ్డిని సన్మానించారు. సీఐ మాట్లాడుతూ.. గ్రామంలో సంత ఏర్పాటు చేయాలనే ఆలోచన రావడం మేలు చేసినవారు అవుతారని సీఐ పెర్కొన్నారు.
గ్రామాల అభివృద్ధి బాధ్యత సర్పంచ్‌లదే
శామీర్‌పేట, ఫిబ్రవరి 18: గ్రామాలను అభివృద్ధి పరిచే బాధ్యత గ్రామాల సర్పంచ్‌లపై ఉందని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎం.వీ. రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో మేడ్చల్ జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు సోమవారం శిక్షణ తరగతులును నిర్వహించారు. ముఖ్యమంత్రి కెసీఆర్ ఆదేశాల మేరకే సర్పంచులకు శిక్షణ కార్యక్రమం చేపట్టామని అన్నారు. ఉన్నతమైన ఆశయాలను ఏర్పరుచుకొని గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నూతన సర్పంచులందరు చిన్న వయస్సు వారే అధికంగా ఉన్నారని వీరందరు తమ విధులను నియమ నిబంధలను పాటించాలని సూచించారు.
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే తమ పదవులు కోల్పొయే ప్రమాదం ఉందని కలెక్టర్ హెచ్చరించారు. సమర్థవంతమైన పాలన అందించేందుకు సర్పంచులు కృషి చేయాలని అన్నారు. గ్రామ సర్పంచులు తమ గ్రామాల్లో ఉదయం వేళల్లో పర్యటించి ఎప్పటికప్పుడు గ్రామ సమస్యలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశలో నిత్య విద్యార్థిగా ఉండాలని అన్నారు. విధుల్లో ఏలాంటి నిర్లక్ష్యం వహించకుండా సరైన పాలను అందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, నల్సార్ రిజిస్ట్రార్ బాలకృష్ణారెడ్డి, జడ్పీటీసీ సభ్యులు బాలేష్, సంజీవ రెడ్డి, ఎంపీపీలు సుజాత, శ్రీనివాస్ గౌడ్, జయ లక్ష్మీ, డీపీవో రవికుమార్, ఎంపీడీ జ్యోతి, పద్మావతి పాల్గొన్నారు.
ఓటర్ లిస్టులో బోగస్ ఓట్లు లేకుండా చర్యలు తీసుకోవాలి :డీసీ అలీ
మెహిదీపట్నం, ఫిబ్రవరి 18: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బోగస్ ఓట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ సర్కిల్-12 డీప్యూటీ కమీషనర్ మహామ్మద్ ఖాజా ఇంకెషాఫ్ అలీ తెలిపారు. సోమవారం సాయంత్రం సర్కిల్ కార్యాలయంలో ఎన్నికల సమావేశంలో డీసీ మాట్లాడుతూ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని పకడ్బందిగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇటివలే నమోదు చేసుకున్న కొత్త ఓటర్లు లిస్టును తీసుకుని ఇంటింటికి వెళ్లి పక్కాగా విచారణ చేపట్టి కొత్తగా ఓటర్‌ను నమోదు చేస్తున్నాట్లు తెలిపారు. ఇప్పటికే ఓటు హక్కు ఉండి, మళ్లీ ఓటు నమోదు చేసుకుంటే వారిపై కఠినంగా వ్యవహరింస్తామని పేర్కొన్నారు. బోగస్ ఓట్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు గుర్తుచేశారు. బోగస్ ఓట్లు విషయంపై కఠినంగా ఉండాలని హెచ్చరించారు. అవసరం అనుకుంటే పోలీసుల సహాకారం తీసుకోవాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో డీసీతో పాటు జీహెచ్‌ఎంసీ అధికారులు, గోషామహెల్ ఏసీపీ నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.