రంగారెడ్డి

సామాన్య రైతు నుండి మంత్రిగా మల్లారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఫిబ్రవరి 19: మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరూ ఊహించని విధంగా అన్యూహంగా స్థానం లభించడంతో శ్రేణుల్లో ఎక్కడలేని ఉత్సాహం పెల్లుబికింది. నగరంలోని బోయిన్‌పల్లి ప్రాంతానికి చెందిన మల్లారెడ్డికి మండలంలోని మైసమ్మగూడ తన అమ్మమ్మ గ్రామం కావడం విశేషం. దీంతో మైసమ్మగూడ గ్రామంటే మల్లారెడ్డికి అంతులేని అభిమానం కూడా. ఇదే గ్రామంలో పెద్ద సంఖ్యలో మల్లారెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఎమ్మెల్యే మల్లారెడ్డిది సామాన్య రైతు కుటుంబం. ఇంతింతై వటుడింతై అన్న చందంగా అంచెలంచెలుగా ఎదిగిన మల్లారెడ్డి నేడు రాష్ట్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి స్థాయికి ఎదిగారు. అందుకోసం ఆది నుండి ఆయన కష్టాన్ని నమ్ముకుని ముందుకుసాగారు. ఆయన అనుకున్నదల్లా బంగారం కాసాగింది. రైతు నుండి విద్యా సంస్థల అధిపతిగా ఎదిగారు. సీఎంఆర్ విద్యాసంస్థలను స్థాపించి రాష్ట్రంలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. మేడ్చల్ పరిధిలోనే మల్లారెడ్డికి సుమారు 40 వరకు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. సురారంలో ఆసుపత్రితో పాటు మెడికల్ కళాశాల కూడా ఉంది. రాష్ట్రంలో అందరికి సుపరిచితుడు కావడంతో రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2014 సంవత్సరంలో టీడీపీలో చేరి దేశంలో అతి పెద్ద పార్లమెంటు నియోజకవర్గం మల్కాజిగిరి నుండి ఎంపీగా పోటీచేసి ఘన విజయం సాధించారు. తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ పిలుపు మేరకు టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గంలో అదిష్టానం ఆదేశాల మేరకు ఎమ్మెల్యేగా పోటీచేసి రాష్ట్రంలోనే నాల్గవ అతి పెద్ద మోజారిటీతో విజయ దుందిభి మోగించి కేసీఆర్ దృష్టిని ఆకర్షించారు. ఇటు క్లాస్‌కు అటూ మాస్‌కు తగ్గట్టుగా వ్యవహరించే మల్లారెడ్డి వ్యక్తిత్వం అందరిని ఇట్టే ఆకట్టుకుంటుంది. తాను ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లో వచ్చానని పేర్కొంటూ అందరిని తన వాక్చాతుర్యంతో తనవైపు తిప్పుకోవడంలో మల్లారెడ్డిది అందెవేసిన చెయ్యిఅని చెప్పడం అతిశయోక్తి కాదేమో. మల్లారెడ్డికి రాష్ట్ర మంత్రివర్గంలో బెర్త్ ఖాయమని ఊహాగానాలు చోటు చేసుకున్నప్పటికీ తరువాతి విస్తరణలో అవకాశం లభిస్తుందేమోనని సాక్షాత్తు మల్లారెడ్డి కూడా పేర్కొన్నారు. అయితే అకస్మాత్తుగా సీఎంఓ కార్యాలయం నుండి ఫోన్ రావడంతో మల్లారెడ్డి ఒకింత ఆశ్చర్యానికి గురై ఉండవచ్చు. ఎంతో ఘన చరిత్ర గల మేడ్చల్ నియోజకవర్గానికి మళ్లీ 15 సంవత్సరాల తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం లభించిందని చెప్పవచ్చు. గతంలో మేడ్చల్ నుండి ఎన్నికైన చెన్నారెడ్డి ఏకంగా ఆవిభక్త ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేయగా ఆ తర్వాత కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఉమా వెంకట్రాం రెడ్డి, టీడీపీ నుండి రెండు పర్యాయాలు ప్రాతినిథ్యం వహించిన దేవేందర్ గౌడ్ మంత్రివర్గాల్లో కీలక శాఖల్లో బాధ్యతలు నిర్వహించి టీడీపీలో నంబర్ టూ స్థానానికి ఎదిగారు. మళ్లీ తర్వాత మేడ్చల్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన మల్లారెడ్డికి మంత్రి పదవి వరించింది. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన మేడ్చల్ జిల్లాకు మల్లారెడ్డి మొట్ట మొదటి మంత్రిగా పదవి చేపట్టడం రికార్డు. మల్లారెడ్డికి కార్మిక, ఉపాధిశాఖ మంత్రిగా పదవి దక్కడంతో ఆయన అనుచరుల్లో ఎక్కడ లేని ఆనందం ఉప్పొంగుతుంది. మేడ్చల్ జిల్లా నుండి తొలి మంత్రిగా మల్లారెడ్డి రాష్ట్ర ప్రజలకు మరింత సేవచేసి జిల్లాను, మేడ్చల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పర్చాలని ప్రజలు ఈ సందర్భంగా కోరుకుంటున్నారు.