రంగారెడ్డి

ఔటర్ రింగ్‌రోడ్డులో పచ్చదనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఫిబ్రవరి 19: ఔటర్ రింగ్‌రోడ్డులో మరో నెల రోజుల్లో మరింత పచ్చదనం ఏర్పడేటట్లు అవసరమైన చర్యలు తీసుకోవాలని హెచ్‌ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్ ఆదేశించారు. మంగళవారం బుద్ధపూర్ణిమలో ఔటర్ రింగ్‌రోడ్డు నిర్వహణపై అధికారులతో ఏర్పాటుచేసిన సమీక్షా సమావేశంలో శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే రహదారిలో మరింత పచ్చదనం పెంచాలని, అందుకోసం అవసరమైన హెడ్ కటింగ్ యంత్రాలను ఏర్పాటుచేసి సిబ్బంది సంఖ్యను పెంచాలని పేర్కొన్నారు. పచ్చదనంతోపాటు రహదారికి ఇరువైపుల పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ముఖ్యంగా టోలు రుసుం కేంద్రాల పరిసర ప్రాంతాలలో విరివిగా మొక్కలు పెంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా పచ్చదనంను పెంచాలన్నారు. ఓఆర్‌ఆర్‌లో తరుచూ ఆకస్మిక తనిఖీలు చేస్తానని, పరిశుభ్రత పాటించకపోతే సంబధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నాటిన మొక్కలు చనిపోకుండా నిర్ధారిత సమయానుసారం నీరు పోయాలని, పెరిగిన మొక్కలను ఆకర్షణీయంగా కత్తిరించి యాత్రికులను ఆకట్టుకునేలా సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా అంతకుముందు జరిగిన జీహెచ్‌ఎంసీ అధికారుల సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ పాల్గొని నగరంలోని వేర్వేరు ప్రాంతాలలో ఉన్న గడియారాలకు మరమ్మతులు చేసి పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. వారసత్వ సంపదను కాపాడేందుకు చేపట్టబోయే పనుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి నాయకత్వంలో మానిటరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని, ఇందులో ఎలక్ట్రికల్ సివిల్ ఇంజనీర్లతో పాటు ప్లానింగ్ విభాగం అధికారులను భాగస్వాములను చేయాలని పేర్కొన్నారు. మానిటరింగ్ యూనిట్‌కు ఆర్ధిక లావాదేవీలు పాలనాపరమైన ఆదేశాలను జారీ చేసేందుకు అవసరమైన అధికారాలు కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ ముషరఫ్, చీఫ్ ఇంజనీర్ జియావుద్ధీన్, సిటీ ప్లానర్ దేవేందర్ రెడ్డి, శ్రీ్ధర్ పాల్గొన్నారు.