రంగారెడ్డి

రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాబాద్, మే 28: రైతులను తెలంగాణ ప్రభుత్వం నిలువెత్తునా మోసం చేస్తున్నదని బిసి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్. అరుణ్ అన్నారు. శనివారం షాబాద్ మండల పరిధిలోని నరెడ్లగూడలోని రైతుల పొలాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత రైతులకు ఎలాంటి మంచి పనులు చేయలేదని పేర్కోన్నారు. మండలంలో 70 శాతం మంది రైతులు పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని తెలిపారు. రైతులకు బ్యాంకు రుణాలు పూర్తిగా మాఫి చేసి కొత్త రుణాలు అందజేయాలని తెలిపారు. రంగారెడ్డి జిల్లా ప్రాంతం వర్షాలపై ఆధారపడి ఉండడంతో వర్షాలు సరిగా లేక చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వివరించారు. కరువునష్టం రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురౌవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతాంగాన్ని ఆదుకోవాలని సూచించారు. మండల పరిధిలోని మన్‌మ్మరి గ్రామంలో బిసిలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు క్రిష్ణయాదవ్, ప్రధాన కార్యదర్శి రాపోల్ నర్సింలు, చేవేళ నియోజకర్గ ప్రచార కార్యదర్శి వెంకటస్వామి, కార్యర్తలు సతీష్, శ్రీశైలం, శ్రీనివాస్, జైపాల్, కార్తీక్, రమేష్ పాల్గొన్నారు.

సైబరాబాద్‌లో 50వేల సిసి కెమెరాలు

* సి.వి.ఆనంద్
గచ్చిబౌలి, మే 28: ప్రభుత్వం ప్రజల సహకారంతో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 50వేల సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తామని పోలీసు కమిషనర్ సి.వి.ఆనంద్ అన్నారు. గచ్చిబౌలిలోని నాగార్జున కన్‌స్ట్రక్షన్ అర్బన్ గేటెడ్ కమ్యూనిటీలో ఏర్పాటుచేసిన సిసి కెమెరాలను, ఇంకుడు గుంతల పనులను ఆయన ప్రారంభించారు. అభయ కేసు అనంతరం మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆనంద్ వెల్లడించారు. మహిళల కోసం షీటీమ్, షీషటిల్, షీ క్యాబ్‌లు ఏర్పాటు చేసామని రెండున్నరేళ్లుగా ఎలాంటి సంఘటన జరగలేదని, దీనికి తాము చేపట్టిన భద్రతా చర్యలే కారణమన్నారు. మహిళల భద్రతపై తాము చేస్తున్న ప్రచారం మంచి ఫలితాలిచ్చాయని అన్నారు.
కమిషనరేట్ పరిధిలో ప్రభుత్వంతోపాటు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకువచ్చి సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. సిసి కెమెరాల సాయంతో రోజుకి రెండుమూడు కేసులు ఛేదిస్తున్నామని, హత్యలు, దొంగతనాలు, దాడుల్లాంటి కేసుల చిక్కు ముళ్లు సిసి కెమెరాల ఫుటేజ్‌తో దోషులను పట్టుకున్నట్లు చెప్పారు. సిసి కెమెరాలు 24 గంటలు పనిచేస్తాయని, పోలీసులు, సెక్యూరిటీగార్డు ఇంటి యజమాని నిద్రపోవచ్చన్నారు. ఈ ఏడాది వర్షాభావంవలన తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడిందని, భూగర్భ జలాలు వృధాపోకుండా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇప్పటివరకు 3వేల సిసి కెమెరాలు ఏర్పాటు చేసామని, ఈఏడాది 10వేలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.
పౌరుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, ఇక్కడి భద్రతా చర్యలను గ్రహించిన దొంగలు హైదరాబాద్‌లో చోరీలు చేయడానికి భయపడుతున్నారని అన్నారు.
ట్రాఫిక్ డిసిపి ఎం.శ్రీనివాసరావు, ఎన్‌సిసి అర్బన్ అసోసియేషన్ ప్రవీణ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

రోడ్ల మూసివేత వాయదాతో
ఊపిరి పీల్చుకున్న ప్రజలు
అల్వాల్, మే 28: కంటోనె్మంట్‌లో రోడ్ల మూసివేత నిర్ణయాన్ని ఆరు మాసాలపాటు వాయిదా పడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. రోడ్ల ఉన్నవి కంటోనె్మంట్‌లోనైనా ప్రయాణించేది అధికంగా మల్కాజిగిరి, కాప్రా మన్సిపాలిటీకి చెందిన ప్రజలు. వీరు నగరానికి రావాలన్నా నగరం నుండి తిరిగి వారి వారి నివాసాలకు వెళ్లాలన్నా ఇదే ప్రధాన మార్గం. ప్రతి రోజు సుమారు 10 లక్షల మంది కంటోనె్మంట్ రోడ్ల గుండా ప్రయాణం సాగిస్తున్నారు. అందుకే ఇంతస్థాయిలో వివాదం జరుగుతోంది. గప్రత్యామ్నాయ రోడ్లు ఏర్పాటు చెయ్యటంలో కంటోనె్మంట్, జిహెచ్‌ఎంసి, హైదరాబాద్ జిల్లా యంత్రాంగం విఫలమైందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు మూసివేతకు భద్రత ప్రధాన కారణమైతే దానికి తీసుకోవాల్సిన జాగ్రత చర్యల గురించి ఎవరూ చర్చింటం లేదు. మూసి వెయ్యాలనీ మిలటరీ అధికారులు, కాదు ప్రజల కోసం మూయకూడదని ప్రజాసంఘాలు డిమాండ్ చెయ్యటం తప్ప మరోమార్గం రెండవ మాట కాని ప్రతి పాదన కాని సూచించటంలేదు. కనీసం మూసివేస్తామంటున్న అధికారులు కూడా ప్రత్యామ్నాయం వైపు ఆలోచించకపోవటంతో సమస్యకు పరిష్కారం లభించటంలేదు. రాబోయే ఆరుమాసాల్లో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోని యుద్ధ ప్రాతిపదికన ప్రత్యామ్నాయ రోడ్లు ఏర్పాటు చెయ్యకుంటే సమస్య మళ్లీ మొదటికి వచ్చె ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.