రంగారెడ్డి

ఉద్యమకారులపై కేసులను ఎత్తివేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, మే 31: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఉద్యమంలో ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని రాజకీయ ఐకాస చైర్మన్, రిటైర్డ్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జెఎసి తూర్పు విభాగం చైర్మన్ వెదిరె చల్మారెడ్డి ఆధ్వర్యంలో జెఎసి నేతలు స్థానిక చౌరస్తాలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు సంఘీభావం తెలిపిన అనంతరం కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో రాజకీయ నాయకులు, ఐకాస నేతలు, న్యాయవాదులు, ప్రజలు, విద్యార్థులు, యువకులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కర్షకులు ఎన్నో పోరాటాలు నిర్వహించారని అన్నారు. కులమత, వర్గ విభేదాలకతీతంగా పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ఉద్యమకారులపై కేసులు పెట్టారని, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయకుంటే తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. ఉద్యమకారులపై కేసులను ఉపసంహరించుకునే విధంగా చట్టాలను తిరగరాయాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో రాజకీయ ఐకాస తరపున రాష్ట్భ్రావృద్ధిలో బాధ్యతాయుతంగా పనిచేస్తామని చెప్పారు. అనంతరం భువనగిరి పార్లమెంటు సభ్యుడు బూర నర్సయ్యగౌడ్ దీక్షలు చేపడుతున్న నేతలకు సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, కుల సంఘాల నేతలు, తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు.