రంగారెడ్డి

సర్కారు పంతుళ్లు పాఠాలు మానేసి దందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, మే 31: సర్కారు బడిబంతుళ్లు దందాలు చేసుకుంటూ చదువు చెప్పడం లేదని రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ ఆవేదన వ్యక్తం చేసారు. చందానగర్‌లో జరిగిన ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఎమ్మెల్యే ఎ.గాంధీ, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. కొంతమంది ఉపాధ్యాయులు రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, చిట్టీల వ్యాపారం చేసుకుంటున్నారని, దాంతో చదువు కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేసారు. మండల పరిధిలో కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత కింద అన్ని సదుపాయాలు కల్పించినా ఫలితాలు దారుణంగా వున్నాయన్నారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో శేరిలింగంపల్లి 11వ స్థానంలో వుండడం బాధాకరమన్నారు. అవసరం లేకున్నా విద్యా వాలంటీర్లను పెట్టుకుని సోమరిపోతులుగా తయారవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఇప్పటికైనా శ్రద్ధపెట్టి ఉత్తీర్ణత పెంచి తమ వృత్తికి వనె్న తేవాలని సూచించారు.
ఇంజనీర్లపై ఎమ్మెల్యే ఆగ్రహం
ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణం కోసం ఇంజనీర్లకు అంచనాలు రూపొందించే పరిజ్ఞానం కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. నిధులు సరిపోక అర్ధాంతరంగా వదిలేయడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. సిఎం కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు వైభవంగా జరపాలని అన్నారు. ఎంఇఓ రామచందర్, బాలానగర్ ఎంఇఓ వరకుమార్ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.