రంగారెడ్డి

లక్ష్మీనరసింహ స్వామి కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాచారం, మార్చి 17: లక్ష్మీనరసింహ స్వామి కల్యాణ మహోత్సవాన్ని యాచారం మండలం మొండిగౌరెళ్లిలో వైభవంగా నిర్వహించారు. మొండిగౌరెళ్లి గ్రామంలోని గుట్టపైనున్న శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో ఆదివారం కల్యాణ మహోత్సవం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఉత్సవ మూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు మాజీ సర్పంచ్ యాదమ్మ యాదయ్య అన్నదాన చేశారు. కల్యాణ మహోత్సవాన్ని మర్పల్లి రమేశ్, కుంటి పాండు దంపతులు జరిపించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండమీది కృష్ణ, ఉప సర్పంచ్ యాదగిరి రెడ్డి, వార్డు సభ్యులు యెట్టి లక్ష్మయ్య, పూజారి యాదయ్య పాల్గొన్నారు.

మల్కాజిగిరి కాంగ్రెస్ నియోజకవర్గ సమావేశానికి విజయశాంతి, రేవంత్‌రెడ్డి రాక
మేడ్చల్, మార్చి 17: మల్కాజిగిరి పార్లమెంటు కాంగ్రెస్ నియోజకవర్గ సమావేశం సోమవారం మేడ్చల్ నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్ ఆదివారం తెలిపారు. మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, సమావేశానికి హజరవుతారని వివరించారు. మేడ్చల్‌లోని ఎన్‌జేఆర్ - కేఎల్‌ఆర్‌నగర్‌లో గల క్లబ్‌హౌజ్‌లో నిర్వహించే సమావేశానికి విజయశాంతి, ఎంపీ అభ్యర్థి రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిలుగా పాల్గొంటారని కూన తెలిపారు.
19న తలకొండపల్లిలో మెగా వైద్య శిబిరం
తలకొండపల్లి, మార్చి 17: రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండల కేంద్రంలోని మంగళవారం ఉదయం తోమ్మిది గంటలకు మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఉచిత మల్టీ స్పెషలిటీలో మెగావైద్య ఆరోగ్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తలకొండపల్లి పీహెచ్‌సీ వైద్యులు నాగరాజు, శారద, గట్టు ఇప్పలపల్లి డాక్టర్ అజీమ్ తెలిపారు. ఈమెగా వైద్య శిబిరాన్ని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ,పవర్ గ్రీడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో నిర్వహిస్తున్నారు.ప్రభుత్వ దంత వైద్య కళాశాల అప్జల్‌గంజ్, యశోద, కేర్, కామినేని, కీమ్స్ హాస్పిటల్స్‌కు చెందిన ఫిజీషియన్, జనరల్ సర్జన్‌లతో స్ర్తిల వ్యాధి, గుండె, ఎముకలు, కీళ్లు, కండరాలు, కంటి, మూత్రపిండాలు, చర్మం, చిన్నపిల్లలు, మధుమేహాం, ముక్కు, చెవి, గొంతు, దంత, ఊపిరితిత్తులు, నరాల బలహీనత, క్యాన్సర్ వ్యాధి తదితర వైద్య నిపుణులచే మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పెర్కొన్నారు. శిబిరాన్ని విజయవంతం చేయడానికి మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, స్వచ్ఛంద సంస్థల వారు పెద్ద సంఖ్యలో హాజరై లబ్ధిపొందాలని సూచించారు.