రంగారెడ్డి

ప్రైవేట్ పాఠశాలలకు ‘ఒంటిపూట’ వర్తించవా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, మార్చి 17: మండుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని మార్చి 15 వతేదీ నుండి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసారు. నిబంధనలకు విరుద్ధంగా మండలంలోని ప్రైవేట్ పాఠశాలలు సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు పదవ తరగతి పరీక్షల బీజీలో ఉన్నందున ప్రైవేట్ పాఠశాలపై నిఘా పెట్టే సమయం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల చేతుల్లో అధికారులు కీలుబొమ్మలుగా మారారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా లిఖిత పూర్వకంకా ఫిర్యాదు చేస్తేనే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలపటం గమనార్హం. అధికారులు ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
గ్రామాల్లో పోలీసుల కవాతు
కీసర, మార్చి 17: పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించటానికి పోలీసులు కీసర మండలంలోని రాంపల్లి దాయర, రాంపల్లి గ్రామాల్లో మార్చ్ఫాస్ట్, కవాతు నిర్వహించారు. కీసర సీఐ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో కుషాయిగూడ ఏసీపీ శివకుమార్ సారథ్యంలో 120 మంది కేంద్ర పోలీసు బలగాలు, స్థానిక పోలీసులతో కీసర మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. గ్రామాల్లో ఎన్నికలు ప్రశాతంగా నిర్వహించటానికి భారీ పోలీసు బందోబస్తు ఉంటుందని, ప్రజలు ప్రశాతంగా ఓటు హక్కును వినియోగించు కోవాలని శివ కుమార్ తెలిపారు. గ్రామాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరగటానికి ప్రజలు సహకరించాలని, ఎలాంటి ప్రలోభాలకులోను కారాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ శోభన్‌బాబు, రాజసూర్యం, జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
కన్నుల పండువగా
శ్రీకట్ట మైసమ్మ కల్యాణ వేడుకలు
ఉప్పల్, మార్చి 17: పట్టణంలోని హెచ్‌ఎండీఏ భగాయత్ లేఅవుట్‌లో చరిత్ర కల్గిన బొప్పన్ చెరువు కట్ట మైసమ్మ ఆలయంలో మహోత్సవ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల మధ్య నిర్వహించిన వేడుకల్లో భాగంగా ఆదివారం మైసమ్మ తల్లి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. కట్ట మైసమ్మ ఆలయ వ్యవస్థాపక కమిటీ అధ్యక్షుడు కంచెమీది శివయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కంచెమీది రవీందర్, కార్యవర్గ సభ్యుల నేతృత్వంలో కుటుంబ సభ్యులు, బందువులు, స్నేహితులు, పరిసర ప్రాంతాల నుంచి భక్తులు కల్యాణ వేడుకల్లో పాల్గొని పూజలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తల్లికి బోనంతో నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మేకల శివారెడ్డి, పట్టణ పెద్దలు వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఒగ్గు కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. శివసత్తుల నృత్యాలు, పోతరాజుల విన్యాసాలతో జాతర ఘనంగా జరిగింది. ఆలయ పునర్ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆలయ కమిటీ అధ్యక్షుడు కంచెమీది శివయ్య పేర్కొన్నారు.