రంగారెడ్డి

రూ.25 కోట్లతో రవాణా శాఖకు సొంత భవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హయత్‌నగర్, జూన్ 18: తెలంగాణ రాష్ట్రంలో రవాణా శాఖను ఆధునీకరించేందుకు రూ.25కోట్లతో సొంత భవనాలు నిర్మిస్తున్నట్టు రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. హయత్‌నగర్ మండలం మనె్నగూడ ఆర్టిఓ కార్యాలయంలో డ్రైవింగ్ ట్రాక్‌ను శనివారం ఆయన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ కొత్త రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా రవాణా శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఇందులో భాగంగా రోడ్డు భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో 88లక్షల వాహనాలు ఉన్నాయని, అందులో సగభాగం ద్విచక్ర వాహనాలు ఉన్నాయని తెలిపారు. ప్రమాదాల నివారణకు రహదారుల నిబంధనలను తప్పక పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తామని అన్నారు. మనె్నగూడ ప్రాంతాలతో పాటు ఇతర రవాణా శాఖ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు. హరితహార కార్యక్రమంలో భాగంగా రవాణా శాఖలో మొక్కలను విధిగా నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిటిసి వెంకటేశం, ప్రణీత, హయత్‌నగర్ జడ్‌పిటిసి తావుల నర్సింహ్మ, ఎంపిపి హరిత ధన్‌రాజ్‌గౌడ్, సర్పంచ్ మేతరి అంజయ్య, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

భర్త ఇంటి ముందు ధర్నా

అల్వాల్, జూన్ 18: ప్రేమించి పెళ్లి చేసుకుని సంవత్సరం తర్వాత తనను వదిలి వారి అమ్మనాన్న దగ్గరకు వెళ్లిన భర్త ఇంటి ముందు యువతి శనివారం ధర్నాకు దిగిన ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అత్తాపూర్ నివాసి మీనాక్షి (24) అల్వాల్ నివాసి తిరుమలరావును ప్రేమించి పెద్దలను కాదని పెళ్లి చేసుకున్నారు. సంవత్సరం పాటు వారు సుచిత్ర వద్ద కాపురం పెట్టారు. భర్త పనీపాటా లేకుండా ఇంట్లోనే ఉండేవాడు. మీనాక్షి ప్రయివేటు ఉద్యోగం చేస్తుండేది. అయితే వారికి ఆర్థిక పరమైన ఇబ్బందులు రావటంతో ఎక్కువ కిరాయి ఉన్న ఇంటిని మారి అల్వాల్ రిలయన్స్ వద్ద చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటుంన్నారు. పనిలేని భర్త మద్యం తాగటానికి అలవాటు పడి డబ్బుల కోసం వేధించడమే కాకుండా, మీనాక్షిని అనుమానించటం ప్రారంభించారు. దీనితో ఇద్దరి మధ్య గొడవ కావటంతో తిరుమలరావు ఓల్డు అల్వాల్‌లోని తమ అమ్మ నాన్న దగ్గరికి వెళ్లి భార్య దగ్గరకు తిరిగి రావటంలేదు. దీంతో మీనాక్షి రెడ్డి ఎన్‌క్లేవ్‌లో ఉన్న భర్త ఇంటి ముందు శనివారం ధర్నాకు దిగింది. చివరకు పోలీస్‌లు జోక్యం చేసుకోని ఆదివారం భర్త కుటుంబ సభ్యులతో చర్చించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వటంతో ఆమె ఆందోళన విరమించింది.