రంగారెడ్డి

రెచ్చిపోయిన చైన్ స్నాచర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జూన్ 18: ఒకవైపు సిసి కెమెరాలు..మరొక వైపు పోలీసు గస్తీలు ముమ్మరం చేసినా చైన్ స్నాచర్ల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. రెచ్చిపోయిన దొంగలు శుక్రవారం రాత్రి మేడిపల్లి, ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో దారిన వెల్లే మహిళలను వెంబడించి వారిపై దాడిచేసి బలవంతంగా బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. పోలీసుల కథనం ప్రకారం పీర్జాదిగూడ శంకర్‌నగర్‌లో నివసిస్తున్న పుష్పలత కిరాణం జనరల్ స్టోర్‌కు వెళ్తుండగా వెనుక నుంచి బైక్‌పై వచ్చిన దుండగులు ఆమె మెడలోని బంగారు చైన్‌ను లాక్కొని పారిపోయారు. ఆ తర్వాత ఉప్పల్ సరస్వతికాలనీలో వాకింగ్ చేస్తున్న భార్యభర్తలను వెనుక నుంచి వెంబడించి గీతా ఆనంద్ మెడలోని నల్లపూసల తాడును లాక్కొని పారిపోయారు. ఆమె అప్రమత్తతో మెడలో ఉన్న నాలుగు తులాల చైన్ దక్కింది. అందిన ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మేడిపల్లి, ఉప్పల్ పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా మేడిపల్లి పోలీసులు సంఘటన వివరాలను తెలపకపోవడం గమనార్హం. ఒకేరోజు రెండు వేర్వేరు ప్రాంతాలలో చైన్ స్నాచింగ్‌లు జరుగడంతో మహిళలు బయటకు వెళ్లేందుకు భయాందోళన చెందుతున్నారు.

ఆంధ్రాబ్యాంక్‌లో చోరీకి యత్నించిన ఇద్దరి అరెస్టు

జీడిమెట్ల, జూన్ 18: ఆంధ్రాబ్యాంక్‌లో చోరీకి యత్నించిన ఇద్దరు దొంగలను పేట్‌బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శనివారం పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బాలానగర్ జోన్ ఇన్‌చార్జి డిసిపి సాయిశేఖర్, పేట్‌బషీరాబాద్ ఏసిపి అశోక్‌కుమార్, సిఐ డివి రంగారెడ్డి నిందితుల వివరాలను వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా, బిక్నోర్ మండలం, బస్వాపూర్ గ్రామానికి చెందిన తుడుం స్వామి (25) సుచిత్రలోని ప్రభుత్వ పాఠశాల వెనుక నివాసముంటూ కూలిపనులు చేస్తుంటాడు. అదే జిల్లా దోమకొంద మండలం, సంగమేశ్వర్ గ్రామానికి చెందిన సడుగు నవీన్ (21) సుచిత్ర, వెనె్నలగడ్డలో నివసిస్తూ కూలి పనులు చేస్తుంటారు. స్వామి, నవీన్ కలిసి ఈనెల 17న తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో దుర్గా ఎస్టేట్‌లోని ఆంధ్రాబ్యాంక్ జీడిమెట్ల శాఖ షట్టర్ తాళాలను పగులగొట్టి లోనికి ప్రవేశించి ముందుగా సిసి కెమెరాలు, సైరన్‌లు మోగకుండా వైర్‌లను కట్‌చేశారు. ఆ తరువాత లాకర్‌ను తెరిచే ప్రయత్నం చేయగా లాకర్ ఓపెన్ కాకపోవడంతో కంప్యూటర్‌లను మూటకట్టుకున్నారు. బ్యాంక్ సమీపంలో నివాసముండే తామసయ్య ఆర్టీసి డ్రైవర్‌గా పనిచేస్తాడు. రోజూమాదిరిగా తెల్లవారుజామున లేచి రెడీ అవుతుండగా ఇంటి పక్కన గల ఆంధ్రాబ్యాంక్‌లో శబ్దం రావడంతో గమనించి బయటికి వచ్చి చూసే సరికి బ్యాంక్‌లో లైట్‌లు వేసి షట్టర్ తాళాలు పగులగొట్టి కనిపించాయి. విషయాన్ని కానిస్టేబుల్ విజ్ఞేష్, హోంగార్డ్ కృపానందరెడ్డిలకు సమాచారం ఇచ్చాడు. విషయాన్ని గమనించిన దొంగలు బ్యాంక్ నుండి పరారయ్యారు. పారిపోతున్న ఇద్దరు దొంగలైన స్వామి, నవీన్‌లను చూసిన తామసయ్యను కానిస్టేబుల్ విజ్ఞేష్ తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని సమయస్ఫూర్తితో జీడిమెట్ల చెరువు వైపు వెళ్లారు. అక్కడ బ్యాంక్‌లో దొంగతనానికి ప్రయత్నించిన స్వామిని తామసయ్య గుర్తుపట్టాడు. కానిస్టేబుల్ విజ్ఞేష్‌కు చెప్పడాన్ని గమనించి దొంగ అక్కడి నుండి పారిపోయే ప్రయత్నం చేయగా కానిస్టేబుల్ విజ్ఞేష్ పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించాడు. ఈమేరకు నిందితులను రిమాండ్‌కు తరలించారు. దొంగలను చాకచక్యంగా పట్టుకున్న కానిస్టేబుల్ విజ్ఞేష్, తామసయ్య, హోంగార్డ్ కృపానందరెడ్డిలకు రివార్డులను డిసిపి సాయిశేఖర్ ప్రకటించారు.

మనస్తాపంతో డాక్టరు అత్మహత్య

అల్వాల్, జూన్ 18: మనస్తాపంతో యశోద అసుపత్రిలో పనిచేస్తున్న డాక్టరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మంజీరాకాలనీలో శనివారం జరిగింది . అల్వాల్ ఎస్‌ఐ రఘురాం కథనం ప్రకారం అదిలాబాద్ జిల్లా మందమర్రి కల్యాణి బొగ్గుగని ప్రాంత నివాసి రాజేశం కుమార్తె అనుసూయ (26) ఎంబిబియస్ చదివి సికింద్రాబాద్ యశోద అసుపత్రిలో డాక్టరుగా పనిచేస్తోంది. ఆమె ఉన్నత చదువుల కోసం పిజి పరీక్షల ఎంట్రన్స్ పలుమార్లు రాసినా ఉత్తీర్ణత సాధించలేదు దీచితో మనస్తాపానికి గురైన ఆమె శనివారం తెల్లవారు జామున తమ నివాసం మంజీరాకాలనీ ఇంట్లోని బెడ్‌రూంలో చున్నీతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం అమె బెడ్‌రూంలో నుండి ఎంతకు బయటకు రాకపోవటంతో కిటికీలు తెరచి చూడగా ఆమె ఉరివేసుకోని మృతి చెంది ఉంది. దీంతో అనసూయ సోదరుడు సాగర్ ఫిర్యాదు చేశాడు. వెంటనే కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి శవపరీక్షల అనంతరం వారి బందువులకు శవాన్ని అప్పగించినట్లు ఎస్‌ఐ రఘురాం తెలిపారు.

సెల్‌ఫోన్ స్నాచింగ్ ముఠా అరెస్టు
గచ్చిబౌలి, జూన్ 18: రోడ్డుపై వెళ్తున్న వారిని వెంబడించి సెల్‌ఫోన్లు లాక్కుంటూ తప్పించుకు తిరుగుతున్న ఆరుగురు సభ్యులతో కూడిన సెల్‌ఫోన్ ముఠాను మాదాపూర్ పోలీసులు పట్టుకుని విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పటాన్‌చెరువుకు చెందిన మనె్న సురేష్, షేక్ జహంగీర్, ఎండి సాదుల్లా, మచ్చ కిరణ్‌కుమార్‌తో పాటు మరో ఇద్దరు మైనర్‌లు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. మాదాపూర్, మియాపూర్, కూకుట్‌పల్లి, కెపిహెచ్‌బి, సనత్‌నగర్, బాలానగర్ పోలీసు స్టేషన్ల పరిధిలో సెల్‌ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తున్న వారిపై దాడిచేసి స్నాచింగ్‌లకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్నారు. వీరి వద్ద 20సెల్‌ఫోన్లు, ఐదు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. సెల్‌ఫోన్లు కొనుగోలు చేసిన రామాంజనేయులను సైతం అరెస్టు చేసి జైలుకు పంపించారు. బాలనేరస్థులను జువైనల్ హోంకు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ కళింగరాజు తెలిపారు.
మానవులు-మనస్తత్వాలు గ్రంధావిష్కరణ
ముషీరాబాద్, జూన్ 18: దైనందిన జీవితంలో సమాజంలోని స్థితిగతుల్లో మానవుల ప్రతిస్పందనలను మానవులు మనస్తత్వాలు పుస్తకం దర్పణం పడుతోందని పలువురు వక్తలు అన్నారు. యువకళావాహిణి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలో కేకలతూరి కృష్ణయ్యకు యువవాహిణి జీవన సాఫల్య పురస్కార ప్రధానోత్సవం జరిగింది. ప్రముఖ రచయత కృష్ణయ్య రచించిన మానవులు మనస్తత్వాలు గ్రంధాన్ని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి అధ్యక్షుడు డాక్టర్ ఎ.చక్రపాణి ఆవిష్కరించారు. ఎఎన్నార్ నాటక కళాపరిషత్ అధ్యక్షుడు సారిపల్లి కొండల్‌రావు, సినీ నటుడు తనికెళ్ల భరణి, రచయిత డాక్టర్ పోతుకూచి సాంబశివరావు, రచయిత వోలేటి పార్వతీశం, రాజా శివానంద, సంస్థ అధ్యక్ష, కార్యదర్శిలు వైకె నాగేశ్వర్‌రావు, జి.మల్లిఖార్జున్‌రావు ప్రసంగించారు.