రంగారెడ్డి

ఈవీఎం వేర్‌హౌజ్ గోదామ్ పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఏప్రిల్ 20: రాష్ట్రంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో వాడకుండా ఉన్న ఈవీఎం, వీవీప్యాట్లను భద్రపర్చిన మండలంలోని కండ్లకోయ గ్రామ పరిధిలోని సెంట్రల్ స్టేట్ వేర్‌హౌజ్‌ను శనివారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎంవీ రెడ్డి పరిశీలించారు. శుభ్రపరిచిన ఈవీఎంలు, వీవీప్యాట్లకు ఎటువంటి నష్టం జరుగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమోరాలను పరిశీలించి, నిరంతరాయంగా సీసీ కెమోరాలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గోదాంలో ఎటువంటి అగ్నిప్రమాదాలకు తావివ్వకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, ముందస్తు జాగ్రత్తలు కూడా చేపట్టాలని సూచించారు. నిరంతరం విద్యుత్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అంతరాయం ఏర్పడినచో జనరేటర్ పనిచేసే విధంగా చూడాలని విద్యుత్‌శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఈవీఎం, వీవీప్యాట్ల నమోదు రిజిష్టర్‌లను పరిశీలించారు. అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట కీసర డివిజన్ ఆర్డీవో లచ్చిరెడ్డి, మేడ్చల్ తహశీల్దార్ వెంకట్ రెడ్డి ఉన్నారు.