రంగారెడ్డి

బీరప్పస్వామి కల్యాణోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొంరాస్‌పేట, ఏప్రిల్ 21: మండల పరిధిలోని మెట్లకుంటలో ఆదివారం బీరప్పస్వామి, కామరతిదేవిల కల్యాణోత్సవం కన్నులపండువుగా జరిగింది. మండలంలోని యాదవ కులస్థులు భారీసంఖ్యలో తరలివచ్చి స్వామి, అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని తిలకించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. గ్రామం నుంచి మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పట్టువస్త్రాలు తీసుకువచ్చారు. తమ ఇష్టదైవమైన బీరప్పను దర్శించుకునేందుకు భక్తులు బారులుతీరారు. బీరప్ప స్వామి కల్యాణంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, పార్టీ నాయకులు మహేందర్ రెడ్డి, రామకృష్ణ యాదవ్, శేఖర్ గౌడ్, శ్రావణ్ గౌడ్, లచ్చప్ప, రమణా రెడ్డి, బండశ్రీను, నారాయణ పాల్గొన్నారు. భాజపా తాలుకా కన్వీనర్ బాబయ్య నాయుడు, పున్నం చంద్ లాహోటి, వెంకటయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రశాంతతకు నిలయాలు దేవాలయాలు
జీడిమెట్ల, ఏప్రిల్ 21: ప్రశాంతతకు నిలయాలు దేవాలయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేక్ అన్నారు. చింతల్ డివిజన్ భగత్‌సింగ్ నగర్‌లోని నల్లపోచమ్మ దేవాలయ పునఃనిర్మాణ పనులకు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజుతో కలిసి వివేక్ శంకుస్థాపన చేశారు. బొడ్రాయి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల అభివృద్ధికి ఎల్లప్పుడు కృషి చేస్తామని అన్నారు. అమ్మవారి కృపా, కటాక్షలతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని వేడుకున్నారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మారెడ్డి, రఫీ, అశోక్, నరేందర్, సత్యం, ఎల్లేశ్, పుండరీకం, వెంకట్‌రెడ్డి, కుమార్ గౌడ్, ప్రతాప్ రెడ్డి, దేవన్న, నాగభూషణం, వణం రాజు, సాయికిరణ్, అభిరామ్ పాల్గొన్నారు.
ఉత్సాహంగా డామ్నిక్స్ అవార్డ్స్ వేడుకలు
హయత్‌నగర్, ఏప్రిల్ 21: డామ్నిక్స్ విద్యాసంస్థల అవార్డ్స్ వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థులు కేరింతలతో చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన విద్యాసంస్థల కరస్పాండెంట్ పీఎస్ అంకితా రెడ్డి.. ఆయా రంగాల్లో ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అంకితారెడ్డి మాట్లాడుతూ జాతి గర్వించే విధంగా పిల్లలు ఎదిగేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలని అన్నారు. విద్యతో పాటు క్రీడలు, పోటీ పరీక్షల్లో రాణించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహతో ముందుకు సాగాలని కోరారు. ప్రతిభను గుర్తించి ప్రోత్సాహం అందిస్తే లక్ష్యాలను సులువుగా చేరుకుంటారని పేర్కొన్నారు.

‘ఉగ్రమూకల రక్త దాహానికి అంతం లేదా’
తాండూరు, ఏప్రిల్ 21: ప్రపంచ పటంలో మరో మాయని మచ్చగా ఆదివారం ఉదయం శ్రీలంక దేశ రాజధాని కొలంబోలో చోటు చేసుకున్న ఘాతుకం శోఛనీయమని క్రిష్టియన్ సంఘాల మత పెద్దలు, ప్రతినిధులు ఆదివారం తమ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. యావత్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న ఉగ్రమూకల రక్తదాహానికి అంతం లేదా అంటూ వారు వాపోయారు. క్రిష్టియన్ సంఘాల ప్రతి నిధులు మాట్లాడుతూ, అమాయకులయిన క్రిష్టియన్, ఇతర మతాలకు చెందిన ప్రజల ప్రాణాలను బలిగొనటం ఆశని పాతంగా మారిందన్నారు. అనంతరం మరణించిన వారి కోసం జీసస్‌ను స్మరిస్తూ ప్రార్థనలు చేశారు.