తెలంగాణ

బ్రాహ్మణ కార్పొరేషన్‌పై కెసిఆర్ కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఈ అంశంపై సంబంధిత నిపుణులతో చర్చలు జరుపుతున్నారని తెలిసింది. కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, నియమావళిని రూపొందించడం, సమర్థవంతంతగా నిర్వహించడం తదితర అంశాలపై ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఒక పర్యాయం కార్పొరేషన్ పనిచేయడం ప్రారంభమైన తర్వాత అది రాష్టవ్య్రాప్తంగా ఉన్న బ్రాహ్మణులకు ఉపయోగపడేవిధంగా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశమని తెలిసింది. ఇందుకోసం ఇతర రాష్ట్రాల్లో నడుస్తున్న బ్రాహ్మణ కార్పొరేషన్ల పనితీరును కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఆగమశాస్త్ర నిపుణులు, రాజకీయాల్లో ఉన్న బ్రాహ్మణులు, పత్రికా రంగంలో ఉన్న బ్రాహ్మణులతో ఆయన చర్చలు జరుపుతున్నారు.
బ్రాహ్మణుల సంక్షేమ నిధికి 2016-17 సంవత్సరం తెలంగాణ బడ్జెట్‌లో 100 కోట్ల రూపాయలు కేటాయించిన విషయం ఈ సందర్భంగా గమనార్హం. కెసిఆర్ తన ఫాంహౌస్‌లో ఇటీవల నిర్వహించిన చండీయాగం సందర్భంగా బ్రాహ్మణుల సంక్షేమంపై దృష్టి కేంద్రీకరించానని, పేదలైన బ్రాహ్మణులకు కూడా రెండుపడకగదుల ఇళ్ల కేటాయింపు చేస్తానని హామీ ఇచ్చారు. బ్రాహ్మణుల్లో పేద విద్యార్థుల చదువు కోసం, పేద అమ్మాయిల వివాహం, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన, వికలాంగులు, వృద్ధులు, వితంతువులు తదితరులు ఎవరైనా ఉంటే వారి ఉపాధికి ఏ విధంగా చేయూత ఇవ్వాలన్న అంశంపై కసరత్తు జరుగుతోంది.
ఈ అంశాలన్నీ పరిశీలించేందుకు ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, రెవెన్యూ (ఎండోమెంట్స్) కార్యదర్శి శివశంకర్ తదితరులను ఒక నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఈ నివేదిక అందిన వెంటనే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఈ సంవత్సరం కేటాయించిన నిధులను పూర్తిగా వినియోగించేలా చూడాలని ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్‌కు 2015-16 సంవత్సరంలో 35 కోట్ల రూపాయలు కేటాయించగా, 2016-17 లో 65 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ కార్పొరేషన్‌కు సీనియర్ ఐఎఎస్ అధికారి, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావును చైర్మన్‌గా నియమించి, ఆయనకు క్యాబినెట్ హోదా కల్పించారు. కార్పొరేషన్‌కు ఒక సిఇఓను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికే ఈ కార్పొరేషన్ ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటు చేసుకుని పనిచేస్తోంది. విద్య, వైద్యం, ఉపాధి తదితర అంశాల్లో బ్రాహ్మణులకు చేయూత ఇవ్వడం ప్రారంభించింది.