రంగారెడ్డి

వర్షం తెచ్చిన కష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఏప్రిల్ 23: గాలి, దుమారం, ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. వరుణుడు కనె్నర్రతో ఉప్పల్ పరిసర ప్రాంతాలలో చెట్లు కూలిపోయి విద్యుత్ వైర్లపై స్థంభాలు విరిగి పడ్డాయి. వైర్లు తెగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రాత్రంతా కాలనీలు అంధకారంలో బంధీ అయ్యాయి. చిమ్మని చీకట్లో ప్రజలు భయం నీడలో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీశారు. ఒకవైపు దోమలు, మరొక వైపు ఉడకపోతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లలో చెట్టుకొమ్మలు విరిగి పడి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి వచ్చిపోయే వాహనాదారులు అవస్థలు పడ్డారు. గతంలో ఎన్నడూ లేని విదంగా కురిసిన వర్షంతో విద్యుత్ శాఖకు ఎంతో నష్టం జరిగింది. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలోని సౌత్ పెవీలియన్‌లో ఈదురు గాలుల తాకిడికి తెర, ఎల్‌ఈడీ ఫ్లడ్ లైట్లు ఎగిరిపోయాయి. పై కప్పు చినిగిపోయి నష్టం ఏర్పడింది. చిల్కానగర్ రహదారిలోని ఆదర్శనగర్ రోడ్డు నెంబర్ వన్‌లో చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ వైరు తెగి కింద పడింది. అన్నపూర్ణకాలనీ, బీరప్పగడ్డ, ప్రశాంతినగర్, సరస్వతి కాలనీ, రామంతాపూర్, బోడుప్పల్ దేవేందర్‌నగర్‌లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ దిమ్మె కూలి వైర్లు నేలకొరిగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇదే ప్రాంతంలో ఇంటి పైకప్పు కూలి సుజాత అనే మహిళకు గాయాలయ్యాయి. చిమ్మని చీకట్లో 24గంటల పాటు పరిసర ప్రాంతాల ప్రజలు రాత్రి వేళల్లో జాగారం చేయాల్సిన దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. హబ్సిగూడ సబ్ డివిజన్ పరిధిలో 44 ఎల్‌టీ లైన్లు, 30హెచ్‌టీ స్థంభాలు నేలకూలి లక్షల్లో నష్టం వాటిల్లిందని అధికారులు పేర్కొన్నారు.
బోడుప్పల్ దేవేందర్‌నగర్‌లో ఈదురు గాలులు, వర్షం కారణంగా ఇంటి పైకప్పు కూలి సుజాత అనే మహిళకు గాయపడింది. ఈ విషయం తెలుసుకున్న జడ్పీటీసీ మంద సంజీవ రెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించి మహిళను పరామర్శించారు. ఇలాంటి సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలను సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు.వర్షం కారణంగా నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, విరిగిన వైర్లను సరి చేయడానికి విద్యుత్ సిబ్బంది రాత్రంతా శ్రమించారు. సూపరింటెండెంట్ ఇంజనీర్ రాముడు పర్యవేక్షణలో డీఈ సత్తమ్మ ఆధ్వర్యంలో ఏడీఈ ప్రశాంత్, ఏఈలు, సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కాలనీలలో పర్యటించి విరిగిన చెట్ల కొమ్మలను తొలగించి లైన్లను క్లియర్ చైశారు. కొన్ని ప్రాంతాలలో మంగళవారం సాయంత్రం వరకు మరమ్మతులు చేపట్ట విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఉప్పల్ కార్పొరేటర్ మేకల అనలా రెడ్డి సరస్వతి కాలనీలో మరీ దగ్గరుండి చెట్ల కొమ్మలు తీయించి విద్యుత్ లైన్లను క్లియర్ చేయించి సరఫరాను పునరుద్ధరించారు. జీహెచ్‌ఎంసీ ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ కృష్ణ శేఖర్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్, శానిటేషన్ అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కాశీ విశ్వనాధ్ సిబ్బందితో రాత్రంతా ఫీల్డ్‌పైన ఉండి చెట్ల కొమ్మలను పక్కకు జరిపించి సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్‌ను క్లియర్ చేసి ప్రజల మన్నలను పొందారు. వర్షంతో విద్యుత్ లైన్లు తెగి సరఫరా నిలిచిపోయిన కారణంగా మంగళవారం ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయంలో ఆన్‌లైన్ సేవలు నిలిచిపోయాయి. కార్యాలయానికి వచ్చిన అధికారులు పని లేక కుర్చీలకే పరిమతమయ్యారు. సాయంత్రం వరకు కూడా సర్వర్ డౌన్‌తో లింక్ పని చేయకపోవడంతో వచ్చిన ప్రజల్ని బయటకు పంపించి గేట్ మూసేశారు. లైసన్స్, రిన్యూవల్, రిజిస్ట్రేషన్ వంటి ఎన్నో పనుల కోసం వచ్చిన ప్రజలు పని జరుగకపోవడంతో తీవ్ర నిరాశతో ఇంటికి వెళ్లిపోయారు. ఆన్‌లైన్‌లో వచ్చిన స్లాట్ ప్రకారం ఎందరో ఉద్యోగులు మరీ సెలవు పెట్టుకుని కార్యాలయానికి వస్తే పని జరగక ఇబ్బందులు పడ్డారు. లైసన్స్ రిన్యూవల్ గ్రేస్ పీరియెడ్ తేదీ ముగిస్తే పెనాల్టీ చెల్లించకతప్పదు అని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ ఉప్పల్ సర్కిల్ కార్యాలయంలో మధ్యాహ్నం వరకు బీఎస్‌ఎన్‌ఎల్ నెట్ పని చేయక ఆన్‌లైన్ సేవలు నిలిచిపోయాయి. దీంతో విద్యుత్ బిల్లుల స్వీకరణకు అంతరాయం ఏర్పడింది.

ఎన్నికలు సజావుగా
జరిగేందుకు కృషి
వికారాబాద్, ఏప్రిల్ 23: మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు సజావుగా సాగేందుకు ప్రతి అధికారి నిబద్ధతతో విధులు నిర్వహించాలని డీఆర్‌ఓ మోతీలాల్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎంసీసీ, ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టి, ఏఈఓ టీంలకు ఎన్నికల సందర్భంగా శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్థానిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారానికి ప్రార్థన స్థలాలు వేదికగా వాడుకోరాదని, జాతి, కుల, మత పేర్లతో ఓట్లు వేయమని అడుగరాదని, ఈ విషయాలను అభ్యర్థులకు తెలియజేయాలని అధికారులకు సూచించారు.