రంగారెడ్డి

తండాల్లో దాహం దాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, మే 19: కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీల్లో గిరిజనులు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని కడియాలకుంట తండా గ్రామ పంచాయతీలో నెలకొన్న సమస్యలతో అవస్థలు పడుతున్నారు. గతంలో బూర్గుల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కడియాలకుంట తండాను తిమ్మాజిపల్లితండా, రాయికల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న బూరుగడ్డతండాను కలిపి మొత్తం ఏడు వార్డులతో ప్రభుత్వం నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసింది. మూడు తండాల్లో కలిపి సుమారు 1500 మంది జనాభా ఉన్నారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా కడియాలకుంటతండాలో తాగునీటి కోసం ఏడాది క్రితం ట్యాంకు నిర్మాణ పనులు ప్రారంభించినా నేటి వరకు పూర్తి కాలేదని గిరిజనులు పేర్కొంటున్నారు. తండాలో నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకొని గత కొన్ని రోజుల క్రితం మంచినీటి సరఫరా కోసం పైప్‌లను తీసుకొచ్చి అలానే వదిలేశారు. పంచాయతీ పరిధిలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా మారడంతో మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తుంది. దీంతో దోమలు, ఈగలు విపరీతంగా వ్యాపిస్తున్నాయని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడియాలకుంట తండా, బూరుగడ్డ తండా, తిమ్మాజిపల్లి తండాల్లో విద్యుత్ దీపాలు సరిగ్గా ఏర్పాటు చేయకపోవడంతో రాత్రివేళ అంధకారం నెలకొంటుందని వాపోతున్నారు. తండాకు బస్సు సౌకర్యం కూడా లేకపోవడంతో నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని తండావాసులు వాపోతున్నారు. తండాలో విద్యుత్ వైర్లు పూర్తిగా వేలాడుతున్నాయని, ఇటీవల తాము విద్యుత్ అధికారులను కలిసి సమస్యను వివరించినా, ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.