రంగారెడ్డి

ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని తగ్గించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, మే 26: ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తి స్థాయిలో తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని షాద్‌నగర్ పురపాలక సంఘం కమిషనర్ శరత్‌చంద్ర కోరారు. ఆదివారం స్థానిక పురపాలక సంఘం పరిధిలోని చటాన్‌పల్లిలో పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచారు. గ్రామంలో పర్యటించి పరిసరాలు శుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. కమిషనర్ శరత్‌చంద్ర మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తేనే స్వచ్ఛమైన గాలి లభించడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు ప్రతి ఒక్కరూ నిర్మించుకోవాలని, నిర్మించుకున్న ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం నుంచి రూ.12వేలు వస్తాయని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జనను పూర్తిగా నిషేధించామని, నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే వారికి జరిమాన విధించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం నిషేధించిన ప్లాస్టిక్ కవర్లను ఎవరు వినియోగించరాదని, ఎవరైనా విక్రయిస్తే వారికి జరిమాన విధించనున్నట్లు తెలిపారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కోరారు. తడి, పొడి చెత్తను వేరువేరుగా వేసేందుకు ప్రజలు కృషి చేయాలని, మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసే విధంగా మున్సిపల్ సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, ఈ విషయాన్ని ప్రజలందరు దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు.