రంగారెడ్డి

నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఎండలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, మే 26: ఎండల తీవ్రత పెరిగిపోతున్న నేపధ్యంలో ప్రజలు ఇళ్ళల్లో నుంచి బయటకు వెళ్లెందుకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం సమయాల్లో రోడ్లు నిప్పుల కొలిమిలా తలపిస్తుండటంతో వాహనదారులు, ప్రజలు రోడ్లపైకి వచ్చేందుకు జంకుతున్నారు. ఉదయం ఎనిమిది గంటలు దాటితే చాలు ఎండలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ప్రచండ భానుడు నిప్పులు కురిపిస్తుండటంతో ఉదయం పది గంటల సమయంలోనే 36 డిగ్రీల నుంచి 38డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఒకవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. మరోవైపు వడగాలులు వీస్తున్న నేపథ్యంలో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వృద్ధులు ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఎప్పుడు లేనంతగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో ఎండల వేడిమిని తట్టుకునేందుకు జనం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. పగటి సమయాల్లో ఉష్ణోగ్రతలు.. రాత్రి సమయాల్లో ఉక్కపోతతో ప్రజలు, వృద్ధులు, చిన్నారులు అల్లాడుతున్నారు. శనివారం ఒక్కరోజే షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, కేశంపేట, ఫరూఖ్‌నగర్, కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ మండల కేంద్రాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో 42.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మే చివరి వారంలోనే ఎండల తీవ్రత ఈ స్థాయిలో ఉంటే మున్ముందు మరేవిధంగా ఉంటుందోనని ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. అత్యవసరమైతే తప్ప జనం కాలు బయట పెట్టలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. మిట్ట మధ్యాహ్నం నిప్పుల కొలిమిలా సెగలు రావడంతో ఎవరూ కూడా బయటకు రావడానికి సాహాసం చేయకపోతున్నారని చెప్పవచ్చు. వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చే ప్రజలు ఎండల వేడిమిని తట్టుకునేందుకు రక్షణ పరికరాలతో వస్తున్నారు.
నిప్పుల కొలిమిలా ‘షాద్‌నగర్’
ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో షాద్‌నగర్ డివిజన్ నిప్పుల కొలిమిలా మారిపోయింది. ఏన్నడు లేని విధంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రచండ భానుడి నుంచి తట్టుకోలేక చల్లదనం కోసం ప్రజలు పరుగులు తీస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చెట్లు వ్యవసాయ బోరు బావుల వద్దకు వెళ్తుండగా పట్టణ ప్రాంతాల్లో ఎసీల కిందకు పరుగులు తీస్తున్నారు. రోజురోజుకూ ఎండల విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పనుల నిమిత్తం బయటకు వెళ్లే వారు ముఖాలకు స్కార్ప్, గొడుగులు చేత పట్టుకొని వెళ్లడంతోపాటు వాహనాలపై వెళ్లే వారు చల్లదనం కోసం కూలింగ్ గ్లాస్‌ను పెట్టుకుంటున్నారు. ఉష్ణోగ్రతలను తట్టుకునేందుకు బయటకు వెళ్లే వారు నీడను వెతుకుంటు చెట్ల కిందకు వెళ్తున్నారు.
వేడివేడిగా వస్తున్న ఫ్యాన్ గాలి
ఎండలు ఎక్కువగా పెరిగిన నేపధ్యంలో ఇళ్లల్లో ఉన్న ఫ్యాన్ గాలి సైతం వేడివేడిగానే వస్తుంది. ఫ్యాన్‌గాలి వేడిగా వస్తుండటంతో కూలర్లు, ఏసీలతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. రాత్రి సమయాల్లో 11గంటలు దాటితే తప్పా వేడిగాలులు తగ్గడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లకు తాళాలు వేసి ఇంటిపై, వాకిట్లో నిద్రించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని ప్రజలు అంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో దొంగల భయం ఉండటంతో ఇళ్లల్లోనే ఫ్యాన్లు వేసుకొని వేడిగాలిని భరిస్తూ నిద్రించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని ప్రజలు పేర్కొంటున్నారు. ఒకవైపు దోమమ బాధ, మరోవైపు ఉక్కపోతను భరించలేక అవస్థలు పడుతున్నామని ప్రజానీకం అంటున్నారు. ఎండల తీవ్రత నుంచి బయట పడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని శాస్తవ్రేత్తలు పేర్కొంటున్నారు.

ఊరూరా ఉద్యమంలా మరుగుదొడ్ల నిర్మాణం
* స్వచ్ఛత వైపు గ్రామాల అడుగులు
* ఫలిస్తున్న అధికారుల చైతన్య కార్యక్రమాలు
బొంరాస్‌పేట, మే 26: మండలంలో మరుగుదొడ్ల నిర్మాణం ఊరువాడల్లో ఉద్యమంలా కొనసాగుతోంది. అధికారులు గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించుకోవాలని పలుమార్లు విన్నవించినా ఆరుబయటకు వెళ్లే అలవాటును మానుకోలేదు. అయినా అధికారులు వెనక్కితగ్గలేదు. తమ ప్రయత్నాలు ఫలించేదాకా గ్రామస్థులను చైతన్యం చేస్తూనే ఉన్నారు. చివరికి వారి ప్రయత్నాలు ఫలించాయి. మహిళలు ఆరుబయటకు మల విసర్జనకు వెళ్లడం వారి ఆత్మ గౌరావాన్ని తీవ్రంగా దెబ్బతిస్తుందని, దీంతో పాటు ఆరుబయట మల విసర్జనతో ప్రజలకు వచ్చే వ్యాధుల గురించి తెలియజెప్పడంతో మెల్లగా వారి ఆలోచనల్లో మార్పు రాసాగింది. అధికారులు ప్రజలకు అర్థమయ్యే రీతిలో వారికి వివరించి చెప్పడంతో తప్పకుండా మరుగుదొడ్డి నిర్మించుకుందామనేలా వారిలో ఆలోచనలు పురిగొల్పుతున్నాయి. వచ్చే నెల రెండో తేది నాటికి వికారాబాద్ జిల్లా మొత్తాన్ని ఓడీఎఫ్ జిల్లాగా మార్చడానికి కలెక్టర్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో ఇంటింటికి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై అధికారులు ప్రజలను చైతన్యం చేస్తున్నారు. గతంలో ఉపాధిహామి పథకంలో మరుగుదొడ్డి నిర్మించుకుంటే బిల్లులు రావడానికి చాలా కాలం పట్టేది. దీంతో మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రజలు ముందుకు రాలేకపోయారు. నేడు స్వచ్ఛ భారత్ మిషన్ పథకం కింద మరుగుదొడ్లు నిర్మించుకున్నవారికి వెంటనే బిల్లులు అందిస్తుండటంతో ప్రస్తుతం నిర్మించుకునేందుకుప్రజలు ముందుకు వస్తున్నారు. దీంతో మండలంలో మరుగుదొడ్ల నిర్మాణం చకచకసాగుతోంది. దీనికితోడు మరుగుదొడ్ల నిర్మాణానికి అవసరమయ్యే రింగుల తయారీ కేంద్రాలు మండలంలోని తుంకిమెట్ల, ఈర్లపల్లి గ్రామాల్లో అందుబాటులో ఉండటంతో నిర్మాణపనుల్లో జాప్యం లేకుండా పనులు సాగుతున్నాయి.
చైతన్య కార్యక్రమాలు
వ్యక్తిగత మరుగుదొడ్లు తప్పకుండా నిర్మించుకోవాలని అధికారులు మండలంలోని అన్ని గ్రామాల్లో కళాజాత బృందాలతో విస్త్రుత ప్రచారం నిర్వహించారు. పక్షం రోజుల క్రితం కలెక్టర్ ఆయేషా.. మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించి వందశాతం మరుగుదొడ్ల నిర్మాణంపై దిశా నిర్దేశం చేశారు. మండలానికి నోడల్ అధికారిగా జిల్లా బీసీ సంక్షేమశాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పుష్పలతను కలెక్టర్ నియమించారు.
గ్రామాల్లో ఆరుబయటకు వెళ్లడానికి పూర్వకాలం మాదిరిగా స్థలాలు కరువయ్యాయి. దీంతో ప్రజలు విధిలేని పరిస్థితుల్లో మరుగుతదొడ్ల నిర్మాణానికి ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న రూ.12 వేల ప్రోత్సాహక సహాయానికి మరింత జోడించి మరుగుదొడ్లు నిర్మించుకుంటున్నారు. మండలంలోని నాగిరెడ్డిపల్లి, గౌరారం, బాపల్లితండాల్లో వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకొని ఇతర గ్రామాలకు ఆదర్శమయ్యాయి. వారి తీరును చూసి ఇతర గ్రామాలు వంద శాతం పూర్తి చేసేందుకు పూనుకుంటున్నాయి. మండలంలోని నాగిరెడ్డిపల్లి, లింగన్‌పల్లి, బాపల్లి, గౌరారం గ్రామాలు ఓడీఎఫ్ గ్రామాలుగా మారాయి. ఈర్లపల్లి, సాలిండాపూర్ గ్రామాలు ఓడీఎఫ్‌కు చేరువలో ఉన్నాయి. మిగితా గ్రామాల్లో అధికారులు ఇంటింటికి తిరుగుతూ ఇళ్ల ముందు మరుగుదొడ్ల నిర్మాణానికి ముగ్గులు వేస్తున్నారు. గుంతలుతీసి రింగులు వేసుకున్న లబ్ధిదారులకు రూ.3 వేలు అందజేస్తున్నారు. అన్ని గ్రామాల్లో జూన్ రెండు నాటికి వందశాతం మరుగుదొడ్ల నిర్మాణమే లక్ష్యంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు కూడా చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గోని ప్రజలను చైతన్యం చేస్తున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ పథకం కింద మండలంలోని 47 గ్రామాల్లో 3581 మరుగుదొడ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉండగా 1758 మరుగుదొడ్లు ముగింపు దశలో ఉన్నాయని ఎంపీడీఓ హరినందన్ రావు తెలిపారు. మిగితా వాటిని త్వరలోనే పూర్తీచేస్తామని వివరించారు.
అందుబాటులో రూ.1.60 కోట్లు
స్వచ్ఛ్భారత్ పథకం కింద మండలంలో రూ. 1.60 కోట్ల నిధులు సిద్ధంగా ఉన్నాయి. మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు నిధుల కొరత లేదని, వెంటనే బిల్లులు చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు. జూన్ రెండు నాటికి అన్ని గ్రామాలను ఓడీఎఫ్‌గా మార్చడానికి కృషి చేస్తున్న క్రమంలో నిధులకు ఎలాంటి ఇబ్బంది లేదని ఎంపీడీవో హరినందన్ రావు తెలిపారు. ప్రజలు ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి
ఉప్పల్, మే 26: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వృద్ధురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించింది. ఈ సంఘటన మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జోడిమెట్ల కాకతీయనగర్‌కు చెందిన సింహాచలం శకుంతల (80) ఈ నెల 16న పీర్జాదిగూడ ప్రధాన రహదారిలో ఉన్న అనుటెక్స్‌లో షాపింగ్ చేయడానికి వచ్చింది. రోడ్డు దాటుతుండగా ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివా రం మరణించిందని ఎస్‌ఐ అమర్‌సిం గ్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.