రంగారెడ్డి

చిరుత దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాచారం, జూన్ 17: శివారు గ్రామాల్లోని అటవీప్రాంతంలో చిరుత వరుసగా మేకలు, గొర్రెల మందలపై దాడులకు తెగబడుతోంది. తాజాగా సోమవారం మండల పరిధిలోని తాడిపర్తి గ్రామంలో మేకల మందపై దాడి చేసింది. ఒక మేకను అటవీ ప్రాంతంలోకి లాక్కెల్లింది. దీంతో రైతులు తీవ్ర భయాందోళనలను వ్యక్తం చేస్తున్నారు. శనివారం కూడా ఇదేవిధంగా తాడిపర్తి గ్రామంలోనే మేకల మందపై దాడి చేసింది. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతను పట్టుకునేందుకు చర్యలు చేపడుతున్నా చిక్కకుండా వీలుచిక్కినప్పుడల్లా మేకల మందలపై దాడులకు తెగబడుతోంది.