రంగారెడ్డి

ప్రభుత్వ బడిలో చేర్పిస్తే చక్కని భవిష్యత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జూన్ 18: బడీడు పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పిస్తే వారి బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తామని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయ శంకర్ సార్ బడి బాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉప్పల్ మండలం పరిధిలోని చిల్కానగర్‌లోని మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఎంఎల్‌సీ జనార్ధన్ రెడ్డి, డీఈఓ విజయాకుమారితో కలిసి చదువుల తల్లి సరస్వతి చిత్రపటానికి జ్యోతిప్రజ్వలన చేశారు. చిన్నారులతో అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర విద్యా వ్యవస్థ దేశానికి ఆదర్శమని, సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతుందన్నారు. సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం, విశాలమైన ప్రదేశంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో తెలుగు, ఇంగ్లీషులో శిక్షణ పొందిన టీచర్లతో ఉచిత విద్యాబోధన జరుగుతుందని పేర్కొన్నారు. ఆత్మ విశ్వాసం, క్రమశిక్షణ, పట్టుదల, కృషి ఉంటే విద్యా ప్రయాణంలో ఎదురే ఉండదని చెప్పారు. బడీడు పేద పిల్లలను సర్కారు బడిలో చేర్పిస్తే ప్రత్యేక దృష్టి పెట్టి వారి భవిష్యత్‌ను తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. జిల్లాల్లో పదవతరగతి ఫలితాల్లో అద్భుత ఫలితాలు సాధించామని, ఇదే స్ఫూర్తితో నూటికి నూరు శాతం ఫలితాలు వచ్చేలా పని చేయాలని అన్నారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించకున్నా, అవకతవకలకు పాల్పడితే కఠినమైన చర్యలు ఉంటాయని, ఎంతటివారైనా ఉపేక్షించేదిలేదని హెచ్చరిస్తూ వండిన అన్నంను పరిశీలించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వంట కమిటీను రద్దు చేసి ఇతరులకు అప్పగించాలని సంబధిత అధికారులను ఆదేశించారు. ఎంఎల్‌సీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ దేశ అభివృద్ధి విద్యతోనే సాధ్యమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు అదనంగా గురుకుల విద్యాలయాలను ప్రవేశపెట్టి ఇంగ్లీషులో విద్యను అందిస్తున్నామని చెప్పారు. కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పెంచే బాధ్యత తీసుకోవాలని అన్నారు. ముందుగా చిన్నారులతో కలిసి మొక్కలను కలెక్టర్ నాటారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గోపు సరస్వతి సదానంద్, ఆర్డీఓ లచ్చిరెడ్డి, ఎమ్మార్వో ప్రమీలా రాణి, ఎంఈఓలు నర్సింహా రెడ్డి, మధుసూదనా చారి, డిప్యూటీ కమిషనర్ కృష్ణ శేఖర్, పాఠశాల కమిటీ చైర్మన్ కీర్తి, హెడ్ మాస్టర్ జోజప్ప పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోవాలి
నిరుపేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలలో వౌలిక వసతుల కల్పనకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీతో పారిశ్రామికవేత్తలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఉప్పల్ చిల్కానగర్‌లోని మండల పరిషత్ హైస్కూల్‌లో జిల్లాలోని పలు పారిశ్రామికవాడల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక సమావేశమయ్యారు. విద్యాపరంగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. పాఠశాలలో అవసరమైన వసతులను కల్పిస్తున్నప్పటికీ ఆర్ధిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని సోషల్ రెస్పాన్సిబులిటీ కింద దగ్గరలో ఉన్న ప్రభుత్వ బడులను దత్తత తీసుకుని విద్యార్థులకు అవసరమైన గదులు, వంట గదులు, బల్లలు, బెంచీలు, మరుగుదొడ్లు, మూత్రశాలలు వంటి సౌకర్యాల కల్పన కోసం చేయూతనివ్వాలని పేర్కొన్నారు.
పారిశ్రామికవేత్తలు జిల్లాల్లో పాఠశాలలను దత్తత తీసుకుని చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఇదే స్ఫూర్తితో మళ్లీ దత్తత తీసుకుని పాఠశాలల అభివృద్ధి కోసం ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఎంఎల్‌సీ జనార్దన్ రెడ్డి, డీఈఓ విజయా కుమారి, ఇండస్ట్రీస్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారి మోహన్ బాబు, ఆర్డీఓ లచ్చిరెడ్డి, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. చిల్కానగర్ ప్రభుత్వ పాఠశాలలో 9.3 మార్కులు సాధించిన విద్యార్థిని సింధూకు స్థానిక కార్పొరేటర్ సరస్వతి రూ.5వేల నగదును కలెక్టర్ ఎంవీ రెడ్డి అందజేశారు. హెడ్ మాస్టర్ జోజప్పను సన్మానించి అభినందించారు.