రంగారెడ్డి

ఆడ పిల్లలను సంరక్షించడం బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, జూన్ 18: ఆడ పిల్లలను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు షాద్‌నగర్ ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్ అన్నారు. మంగళవారం షాద్‌నగర్ పట్టణంలోని బుగ్గారెడ్డి గార్డెన్‌లో వైద్య ఆరోగ్య శాఖ, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బేటీ బచావో..బేటీ పడావో అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా జడ్పీచైర్ పర్సన్ తీగల అనితారెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. జడ్పీవైస్ చైర్మన్ ఈట గణేష్‌తోపాటు ఐదు మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్ మాట్లాడుతూ ఆడ పిల్లలు కలిగిన తల్లిదండ్రులకు ప్రభుత్వం ఎంతో భరోసా కల్పిస్తుందని, అందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ వంటి పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చి ఒక లక్షల ఒకవెయ్యి పదహారు రూపాయలను పెళ్లి కానుకగా ఇస్తున్నారని వివరించారు. ప్రస్తుతం పురుషుల కంటే స్ర్తి సంఖ్య తక్కువగా ఉందని, దాంతో ఎన్నో అరిష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. కొంతమంది వ్యక్తులు గర్భంలో ఆడ పిల్లల అని తెలితే చాలు గర్భంలోనే తుంచివేస్తున్నారు. అలా చేయడం చాలా నేరమని, స్నానింగ్ సెంటర్లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు వివరించారు. చట్ట ప్రకారం లింగనిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఉందని అన్నారు. చిన్నతనం నుంచి ఆడ పిల్లలను అన్ని విధాల అదుకునేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని వివరించారు. చిన్నతనంలో అంగన్‌వాడీ కేంద్రాలకు, పెరిగి పెద్దయిన తరువాత సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో వసతి కల్పించడం, నాణ్యమైన విద్యను నేర్పించేందుకు గురుకుల, మాడల్ పాఠశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వివరించారు. ఆడ పిల్ల జన్మించిందని ఎవరు నిర్సుహా పడవద్దని, ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ తీగల అనితా రెడ్డి మాట్లాడుతూ ఇంట్లో ఆడపిల్ల జన్మించిందంటే మహాలక్ష్లీ వచ్చినట్లే భావించి క్రమశిక్షణతో విద్యను నేర్పించి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టేందుకు తల్లిదండ్రులు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. కుమారులతో సమానంగా బాలికలను చూడాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులపై ఉందని సూచించారు. ఆడపిల్లలను సంరక్షిస్తేనే దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించినట్లు అవుతుందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, జడ్పీటీసీలు పీ.వెంకట్ రెడ్డి, ఎమ్మె శ్రీలత సత్యనారాయణ, ఫరూఖ్‌నగర్ ఎంపీపీ బుజ్జి బాబు నాయక్, ఇద్రీస్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి అందె బాబయ్య, డీఎంహెచ్‌ఓ డాక్టర్ స్వరాజ్యలక్ష్మీ, మున్సిపల్ కమిషనర్ శరత్‌చంద్ర, వైద్యులు డాక్టర్ చందు నాయక్, భీము నాయక్, సీడీపీఓ నాగమణి పాల్గొన్నారు.