రంగారెడ్డి

మేడ్చల్‌లో టీఆర్‌ఎస్ కార్యాలయ భవనానికి భూమిపూజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జూన్ 24: మేడ్చల్ జిల్లా టీఆర్‌ఎస్ కార్యాలయ భవనానికి సోమవారం గండిమైసమ్మలో మంత్రి సీహెచ్ మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేక్‌లు భూమిపూజ చేశారు. జిల్లా కేంద్రాల్లో టీఆర్‌ఎస్ కార్యాలయ నిర్మాణం జిల్లా రాజకీయాల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతుందని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను క్షేత్రస్థాయిలో మరింతగా బలోపేతం చేసేందుకు జిల్లా పార్టీ కార్యాలయాలు నిర్మించాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఎంతో గొప్పదని అన్నారు. తిరుగులేని పార్టీగా తెలంగాణాలో టీఆర్‌ఎస్ దూసుకుపోతుందని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గుర్తించి ప్రజలు మరోసారి టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి అవకాశం కల్పించారని తెలిపారు. రానున్న దసరా వరకు కార్యాలయ భవన నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం చేసుకుంటామని అన్నారు.
వర్షంతో తడిసిననగరం
మెహిదీపట్నం, జూన్24: వర్షంతో తడిసి నగరం ముద్దయింది. కొన్ని ప్రాంతాలలో వర్షం భారీగా కురిసింది. వాతావారణం అంతా ఒక్కసారిగా చల్లబడింది. వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. సోమవారం మధ్యాహ్నం, సాయంత్రం లక్డికాపూల్, మాసాబ్‌ట్యాంక్, విజయనగర్ కాలనీ, నాంపల్లితో పాటు తదితర ప్రాంతాలలో వర్షం కురిసింది. వర్షం కురువడంతో లక్డికాపూల్‌లో భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు పలు ఇబ్బందులు పడాల్సివచ్చింది. పంజాగుట్ట నుంచి లక్డికాపూల్ వరకు, లక్డికాపూల్ నుంచి మెహిదీపట్నం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. జీహెచ్‌ఎంసీ సిబ్బంది వర్షంతో అప్రమత్తమై, రోడ్లుపై వర్షం నిరు నిలువకుండా చర్యలు తీసుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
ఇబ్రహీంపట్నం: రెండు రోజులుగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో సాధారణ నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. సోమవారం సాయంత్రం చిరుజల్లులతో కూడిన వర్షం కురిసింది. మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల్లో గంట పాటు వర్షం కురిసింది. ఖరీఫ్ సాగు మొదలు పెట్టిన రైతులు కురుస్తున్న వర్షంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దుక్కులు దున్నిల పొలాల్లో విత్తనాలు జల్లేందుకు సిద్ధమవుతున్నారు.