తెలంగాణ

నోటిఫికేషన్‌లో తప్పులేల?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: మహబూబ్‌నగర్ జిల్లాలో పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ స్కీం కింద నిర్మించనున్న వట్టెం రిజర్వాయర్ నిర్మాణానికి భూసేకరణ నోటిఫికేషన్‌ను తప్పుడు వివరాలతో విడుదల చేయడాన్ని ఆక్షేపిస్తూ వచ్చే సోమవారంలోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. జస్టిస్ ఏ రాజశేఖర రెడ్డి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. వట్టెం గ్రామానికి చెందిన కె వీరానందం, మరో వ్యక్తి.. వట్టెం రిజర్వాయర్‌కు సంబంధించి జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌లో తప్పులు ఉన్నాయంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాము రిజర్వాయర్, ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకం కాదని, కాని ఫారంలో అనేక ఖాళీలను పూర్తి చేయలేదని తెలిపారు. ప్రాజెక్టు వల్ల రైతులకు మేలు చేకూరుతుందని, నోటిఫికేషన్‌లో తప్పులు సవరించాలని కోరుతున్నట్లు వారు పేర్కొన్నారు. భూసేకరణ కంటే ముందు గ్రామ సభలు నిర్వహించడం, నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రజాభిప్రాయాన్ని సేకరించడం, నష్టపరిహారం చెల్లింపు వివరాలు సేకరించాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు జోక్యం చేసుకుని భూసేకరణ జరిపే హక్కు ప్రభుత్వానికి ఉందని, కాని నోటిఫికేషన్‌లో లోపాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాధికారులదేనన్నారు.