రంగారెడ్డి

అర్హులందరికీ పింఛన్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొడంగల్, జూలై 20: అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్‌లు ఇవ్వడం జరుగుతుందని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. శనివారం కొడంగల్ పట్టణంలోని కేఎస్‌వి పంక్షన్ హాల్‌లో పింఛన్ దారులకు ధృవపత్రాలను అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, జేడ్పీటీసీ అవుటి నాగరాణి, కోట్ల మైపాల్ పాల్గొన్నారు.
పేదవాడి కళ్లలో ఆనందం చూడడమే లక్ష్యం
కుషాయిగూడ, జూలై 20: ప్రతి పేదవాడి కళ్లలో అనందం చూడడమై కేసీఆర్ లక్ష్యమని ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 57 సంవత్సరాలు వృధ్ధులకు రూ. 2016 పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, యంబీసీ చైర్మన్ తాడురి శ్రీనివాస్ కార్పొరేటర్లు స్వర్ణరాజ్, పావని రెడ్డి, అంజయ్య, దేవేందర్‌రెడ్డి పాల్గొని చెకులను పంపిణీ చేశారు.కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారిని ఇంధిర, అంజలీ, వెంకటేష్, సహదేవ్, టీఆర్‌ఎస్ నాయకులు మణిపాల్ రెడ్డి, సతీష్, ప్రవీణ్ పాల్గొన్నారు.

త్వరలో మున్సిపాలిటీతో పాటు కార్పొరేషన్ ఎన్నికలు
ఉప్పల్, జూలై 20: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలతో పాటే కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లా రెడ్డి అన్నారు. శనివారం పీర్జాదిగూడ పర్వతాపూర్‌లోని శబరి గార్డెన్‌లో పెంచిన ఆసరా ఫించన్ల ప్రొసీడింగ్ పత్రాలను అర్హులకు అందజేశారు. కార్యక్రమంలో ఫారెస్టు అధికారి సుధాకర్, మున్సిపల్ కమిషనర్ వాణీ రెడ్డి, మేనేజర్ సురేష్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్ అంజిరెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు జక్క వెంకట్ రెడ్డి, పాశం బుచ్చియాదవ్, బండి సతీష్ గౌడ్, కుర్ర శివ కుమార్ గౌడ్, ఈశ్వర్ రెడ్డి, బండి శ్రీరాములు, బొడిగె కృష్ణ గౌడ్, పప్పుల అంజిరెడ్డి, మద్ది యుగంధర్ రెడ్డి, రాజ రాజు, చెరుకు మహేష్ గౌడ్, కౌడె పోచయ్య, చంద్రా రెడ్డి, శేరి సవితా రెడ్డి పాల్గొన్నారు.