రంగారెడ్డి

ప్రతి గ్రామంలో పార్కులు: ఎర్రబెల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, జూలై 22: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశిస్తున్న ప్రకారం హరితహారంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో ఐదు ఎకరాల నుంచి 10 ఎకరాల్లో ప్రజలందరికి ఉపయోగకరంగా ఉండే విధంగా కండ్లకోయలోని ఆక్సిజన్ పార్కు తరహాలో మోడల్ పార్కులను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. సోమవారం మంత్రి ఎర్రబెల్లి కండ్లకోయ ఆక్సిజన్ పార్కును పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారులతో కలిసి సందర్శించారు. పార్కులో ఏర్పాటుచేసిన వసతులపై ఆటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ అనేక సమస్యలతో సతమతమవుతూ ఒత్తిడికి గురవుతున్న ప్రజలు కొద్దిసేపు ఇలాంటి పార్కులో కూర్చుని సేద తీరితే మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. నగరానికి అతి చేరువలో 70 ఎకరాల్లో అటవీశాఖ ఆక్సిజన్ పార్కును అన్ని హంగులతో అభివృద్ధి చేయడం హర్షణీయమని చెప్పారు. గ్రామాల్లో ప్రభుత్వ అసైన్డ్ భూములను, వృథాగా ఉన్న భూములను గుర్తించి పార్కులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ భూములు లేనిచోట అవసరమైతే దాతల సహకారం తీసుకుంటామని మంత్రి ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో, మండల హెడ్‌క్వార్టర్స్‌లో ఇటువంటి పార్కులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీనిపై త్వరలోనే శిక్షణ నిర్వహిస్తామని పేర్కొన్నారు. కండ్లకోయ ఆక్సిజన్ పార్కును సందర్శించేందుకు పంచాయతీరాజ్‌శాఖ ఉన్న అధికారులను కూడా తీసుకువచ్చినట్లు మంత్రి వివరించారు. సీఎం కేసీఆర్ హరితహారంలో సర్పంచ్‌లకు మరిన్ని బాధ్యతలు అప్పగించారని వివరించారు. సర్పంచ్‌లు కూడా శిక్షణతో పాటు ఇటువంటి పార్కులను సందర్శించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కండ్లకోయ ఆక్సిజన్ పార్కులో ఏర్పాటుచేసిన వసతులపై మంత్రి ఎర్రబెల్లి హర్షం వ్యక్తం చేశారు. వాకింగ్ ట్రాక్‌తో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం, విదేశీ పక్షులను ఏర్పాటు చేయడం ప్రశసంనీయమని అన్నారు. తాను ఎన్నో ప్రాంతాల్లో తిరిగానని ఇలాంటి పక్షులను మాత్రం చూడలేదని వివరించారు. అటవీ భూమిని అభివృద్ధి చేసి ప్రజల ఉపయోగార్ధం పెద్దలకు పిల్లలకు యువతకు విద్యార్థులకు ఉపయోగపడే విధంగా పార్కు ఉందని కితాబిచ్చారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్‌శాఖ పీసీసీఎఫ్ పీకే జాన్, ప్రిన్సిపాల్ సెక్రటరీ వికాస్ రాజ్, పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ నీతు కుమారి ప్రసాద్, అటవీశాఖ అధికారులు చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.