రంగారెడ్డి

ఎల్‌ఐజీ ఫ్లాట్స్ 4వ ఫేజ్ లబ్ధిదారుల సమస్యలపై వినతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేపీహెచ్‌బీకాలనీ, ఆగస్టు 13: కేపీహెచ్‌బీకాలనీ ఎల్‌ఐజీ ఫ్లాట్స్ వెంచర్ 2 లబ్ధిదారుల సమస్యలపై హౌసింగ్ బోర్డు అధికారులకు మంగళవారం అసోసియేషన్ సభ్యులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా ఫ్లాట్స్ 2011 లో హ్యాండోవర్ చేస్తామని 2016లో హ్యండోవర్ చేశారని, దీంతో హౌసింగ్ బోర్డు అధికారుల ఆలస్యం కారణంగా లబ్ధిదారులపై వడ్డీ భారం పడిందన్నారు. అధికారుల డిలే కారణంగా బ్యాంకులకు వడ్డీలు చెల్లించి లక్షల్లో నష్టపోయామన్నారు. కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ అక్రమంగా భయపెడుతూ అండర్ టేకింగ్ లెటర్‌పై సంతకం చేయించుకుని నోటీసులు పంపి లబ్ధిదారులను భయబ్రాంతులకు గురిచేస్తూ మానసికంగా కృంగదీస్తున్నారని అన్నారు. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా ఎలా నోటీసులు ఇస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు మాతంగి మల్లేష్, బ్రహ్మనందారెడ్డి, సురేష్‌రాజు, శాంతకుమార్, కృష్ణంరాజు పాల్గొన్నారు.

పాఠశాలలో ప్రకృతి పంటలకు శ్రీకారం
ఘట్‌కేసర్, ఆగస్టు 13: పకృతి సిద్ధంగా ఆకుకూరలు, కూరగాయలను పాఠశాలలో పండించేందుకు శ్రీకారం చుట్టి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచారని ఘట్‌కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి తెలిపారు. మండల పరిధి అంకుషాపూర్ గ్రామంలోని ప్రాధమిక పాఠశాలలో 2005 బ్యాచ్ పూర్వ విద్యార్ధులతో పకృతి పంట పేరుతో ఏర్పాటుచేసిన కిచెన్ గార్డెన్‌ను ఎంపీపీ వైయస్‌ఆర్ మంగళవారం ప్రారంభించారు. రసాయన ఎరువులను పిచికారి చేయకుండా పకృతి సిద్ధంగా పంటలు పండించటంతో సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చని తెలిపారు. రసాయన ఎరువులవల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లటంతో పాటు మానవ జీవితాలకు మనుగడ లేకుండా పోతుందని చెప్పారు. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి పిలుపు మేరకు పూర్వ విద్యార్ధులు సిహెచ్ గణేష్, సామల శ్రీనివాస్, మేడబోయిన గణేష్‌ల నేతృత్వంలో ఏర్పాటుచేసిన కిచెన్ గార్డెన్‌లను మండలంలోని ప్రతి పాఠశాలలో ఏర్పాటు జరిగేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. పకృతి పంటలను ప్రతి ఒక్కరు తమ ఇళ్లలో ఏర్పాటు చేసుకుని సహజ సిద్ధంగా వచ్చే కూరగాయయాలను పండించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నర్సింహ్మరెడ్డి, ఎంపీటీసీ కొమ్మిడి శోభారాణి, ఉపాధ్యాయురాలు పుష్పలత, మంగ, విద్యా కమిటీ చైర్మన్ చింతకింది శ్రీనివాస్ పాల్గొన్నారు.