రంగారెడ్డి

శిథిలావస్థలో ప్రభుత్వ పాఠశాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హయత్‌నగర్, ఆగస్టు 18: చంపాపేట్ డివిజన్ క్రాంతిక్లబ్ ఆవరణలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థలో ఉందని మెరుగు పరిచి వౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ వార్డు సభ్యుడు ముడుపు రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. పాఠశాలలో సుమారు 340మంది విద్యార్థులు చదువుతున్నారని విద్యార్థులకు సరిపోయనన్ని తరగతి గదులు లేవని తెలిపారు. భవనం శిథిలావస్థలో ఉందని పేర్కొన్నారు. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నూతన భవనం నిర్మించాలని కోరారు.

సుభాష్‌నగర్‌లో తనిఖీలు
జీడిమెట్ల, ఆగస్టు 18: పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడ, సుభాష్ నగర్‌లో బాలానగర్ జోన్ పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. బాలానగర్ జోన్ డీసీపీ పద్మజా ఆధ్వర్యంలో పేట్‌బషీరాబాద్ ఏసీపీ నర్సింహారావు, సీఐ మహేశ్, ఎస్‌ఐలు, పెద్దసంఖ్యలో సిబ్బందితో ప్రతి ఇంటిని జల్లెడపట్టారు. ఇంట్లో నివాసముంటున్న వారి వివరాలను, గుర్తింపు కార్డులను పరిశీలించడంతో పాటు వాహనాల పత్రాలను తనిఖీ చేశారు. ఈ కార్డెన్ సెర్చ్‌లో రెండు కార్లు, 28 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.
ప్రధాన పైప్‌లైన్ వాల్ లీక్ కావటంతో నీరు వృథాగా పోతోంది.
ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్‌గా ఇసాక్ అబ్కాన్
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 18: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన ఇసాక్ అబ్కాన్ బదిలీపై వచ్చారు. అంతకుముందున్న అరుణకుమారి జవహానగర్ మున్సిపాలిటీకీ బదిలీ అయ్యారు. అరుణ కుమారి రెండేళ్ల పాటు మున్సిపల్ కమిషనర్‌గా ఉన్నారు. ఇసాక్ అబ్కాన్‌ను ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.