రంగారెడ్డి

ఎమ్మెల్యే వివేక్‌కు చెందిన రెండు భవనాలు సీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల.ఆగస్టు 6: కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే వివేకానందకు చెందిన రెండు భవనాలను జిహెచ్‌ఎంసి అధికారులు కోర్టు ఆదేశాల మేరకు శనివారం సీజ్ చేశారు. శివార్లలోని చింతల్‌లోని నారాయణ విద్యా సంస్థలు కొనసాగుతున్న రెండు బహుళ భవనాలను అనుమతి లేకుండా నిర్మించారని కొందరు కోర్టును ఆశ్రయించటంతో, ఆ భవనాలను సీజ్ చేయాలన్న కోర్టు ఆదేశం మేరకు జిహెచ్‌ఎంసి అధికారులు సీజ్ చేశారు. ఈ కేసు కొద్దిరోజులుగా కోర్టులో కొనసాగుతున్న సంగతి తెలిసిందే! ఈ రెండు విద్యా సంస్థలు కొనసాగే భవనాలను సీజ్ చేయటంతో అందులో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు అయోమయంలో పడింది. సుమారు మూడు వేల మంది విద్యార్థులు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. తమ పిల్లల చదువు ఎలా సాగుతుందోనన్న ఆందోళన సైతం తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. దీని పై ఎమ్మెల్యే కెపి వివేక్ మాట్లాడుతూ కోర్టు తీర్పును శిరస్సా వహిస్తానని అన్నారు. రెండు భవనాలలో విద్యా సంస్థలు కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తును కోర్టుకు వివరించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు ఇవే భవనాల్లో విద్యా సంస్థలను కొనసాగించేలా అనుమతించాలని కోరనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. తన విన్నపంపై కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేసినా దానికి కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎమ్మెల్యే హోదాలో ఉన్న తన పై కొందరు వ్యక్తులు దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని మానుకోవాలని ఆయన కోరారు.