రంగారెడ్డి

కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, సప్టెంబర్ 15: కల్వకుంట్ల కుటుంబం పాలనలో బందీగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కలిగించడానికి మరో పోరాటానికి రాష్ట్ర ప్రజలు సిద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ పిలుపు నిచ్చారు. బీజేపీ నాయకుడు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీనగర్‌లో ఆదివారం నిర్వహించిన ఎల్బీనగర్ బీజేపీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి లక్ష్మణ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ బంగారు తెలంగాణ పేరుతో అభివృద్ధిలో అగ్రగామిగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా తయారుచేసిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని ఆరోపించారు. తెలంగాణ సాధన కోసం మలి దశ ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల కుటుంబాలను కేసీఆర్ పూర్తిగా విస్మరించాడని గుర్తు చేశారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఉద్యమం సమయంలో కేసీఆర్ ప్రకటనలు చేశారని చెప్పారు. ఇప్పుడు మాట మారుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎంఐఎం నాయకులకు భయపడుతూ విమోచన దినోత్సవాన్ని మరచిపోయాడని లక్ష్మణ్ ఆరోపించారు. ఐదున్నరేళ్ల కేంద్ర పాలనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో అవినీతి రహిత పాలనలో దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న టీడీపీ.. బీజేపీలో పూర్తిగా విలీనం అయిందని, తెలంగాణలో తిరుగులేని పార్టీగా తయారు కానుందని జోస్యం చెప్పారు. బీజేపీని చూస్తుంటే కేసీఆర్ గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయని, అందుకే మంత్రివర్గాన్ని విస్తరించారని పేర్కొన్నారు. అమరవీరుల విగ్రహాలను కూడా ఏర్పాటుచేయని కేసీఆర్ రాష్ట్రంలో తమ భోగాలను, ముఖ చిత్రాలను ప్రచారాలు చేసుకుంటున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆరోగ్యం పూర్తిగా పడకేసి ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని లక్ష్మణ్ ఆరోపించారు. త్వరలో జరిగే మన్సిపాలిటీ ఎన్నికలలో బీజేపీ విజయం సాధించడానికి కార్యకర్తలు కష్టపడి పని చేయాలని చెప్పారు. రాజ్యసభ సభ్యుడు గరికెపాటి మోహన్ రావు మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ రోజురోజుకూ పటిష్టంగా తయారైతుందని, టీఆర్‌ఎస్‌ను ఓడించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీజేపీ పాత కొత్త నాయకులు, కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేసి పార్టీ అభివృద్ధికి పోరాడాలని పిలుపు నిచ్చారు. ఎల్బీనగర్ బీజేపీ నాయకుడు సామ రంగారెడ్డి మాట్లాడుతూ ఎల్బీనగర్‌లో ఉన్న ప్రధాన సమస్యలను పరిష్కారం చేయడంలో అధికార టీఆర్‌ఎస్ పూర్తిగా విఫలం చెందిందని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచిన సుధీర్‌రెడ్డి తమ వ్యక్తిగత స్వార్థం కోసం అధికార పార్టీలో చేరారని రంగారెడ్డి ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ఎల్బీనగర్‌లో ఉన్న 11 డివిజన్‌లను బీజేపీ కైవసం చేసుకుంటుందని రంగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎల్బీనగర్ బీజేపీ కన్వీనర్ వంగ మదుసూధన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు సంకినేని వెంకటేశ్వర్ రావు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, బీజేపీ జాతీయ నాయకులు పేరాల శేఖర్ రావు, బీజేపీ నాయకురాలు శోభారాణి, మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొక్క నర్సింహా రెడ్డి, ఉపాధ్యక్షులు జక్కిడి ప్రభాకర్ రెడ్డి, రంగా నర్సింహా గుప్తా, సుభాష్ రెడ్డి, ఆకుల రమేష్ గౌడ్ పాల్గొన్నారు.