రంగారెడ్డి

పార్టీ పటిష్టతకు కృషి చేసిన వారికి భవిష్యత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, సెప్టెంబర్ 15: టీఆర్‌ఎస్ పటిష్టతకు పని చేసిన నాయకులు, కార్యకర్తలకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్‌కేసర్ పురపాలక సంఘం పరిధిలోని పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో ఆదివారం టీఆర్‌ఎస్‌లో చేరారు. రానున్న మున్సిపల్ ఎన్నికలలో వంద శాతం స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుని అన్ని మున్సిపాలిటీలలో జెండాలను ఎగురవేస్తుందని చెప్పారు. శ్రీనివాస్, నాగరాజు, రవీందర్, నాగేందర్‌కు టీఆర్‌ఎస్ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నోముల నవీన్ ప్రకాష్, ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, ఘట్‌కేసర్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్, మల్లేష్ పాల్గొన్నారు.