రంగారెడ్డి

రక్తదానం..ప్రాణదానంతో సమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, అక్టోబర్ 19: పోలీస్ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకోవడంతోపాటు త్యాగాలను స్మరించుకొని వారి కుటుంబాలకు అండగా ఉండాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్ అన్నారు. శనివారం నందిగామ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్, ఏసీపీ సురేందర్‌లు ప్రారంభించారు. ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర ఎంతో ఉంటుందని, విధి నిర్వహణలో అమరులైన వారి కుటుంబాలకు ఎల్లప్పుడు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరంలో 75మంది యువకులు రక్తదానం చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో కొత్తూరు సీఐ చంద్రబాబు, రూరల్ సీఐ రామకృష్ణ, నందిగామ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, జడ్పీవైస్ చైర్మన్ ఈట గణేష్, సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు జే.వెంకట్ రెడ్డి, మండల అధ్యక్షుడు పద్మారెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్‌గౌడ్ పాల్గొన్నారు.
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలి: కలెక్టర్
శామీర్‌పేట, అక్టోబర్ 19: గ్రామాలను అన్నింటిని పరిశుభ్రంగా ఉంచాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎం.వీ.రెడ్డి ఆదేశించారు. రాజీవ్ రహదారి నుండి తూంకుంట, లాల్‌గడి మల్కపేట గ్రామాల్లోని రోడ్లకు ఇరువైపుల నాటిన మొక్కలను పరిశీలించారు. లాల్‌గడిమల్కపేట గ్రామంలోని మొక్కలకు కలుపు తీసి ఎరువు వేయాలని సర్పంచ్‌ను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కేశవరం గ్రామంలోని హరిజన వాడను సందర్శించి ఈ గ్రామంలోని ప్రజలకు ఇచ్చిన మొక్కలను పరిశీలించిన తరువాత భగీరథ ద్వారా నల్లా కలెక్షన్లను పరిశీలించారు. నల్లా కలెక్షన్లను తొలగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలోని రామచంద్రయ్యకు ఇచ్చిన ఇంటిని సందర్శించి ఆయనకు ఇచ్చిన ఆరు మొక్కలను తనిఖీ చేసి నల్లా కలెక్షన్లను వాడుకోవడంపై కలెక్టర్ అభినందనిస్తూ రూ.1116లు నగదు పరస్కారాన్ని అందజేశారు. గ్రామంలో విద్యుత్ వైర్లు సరిగ్గా లేకపోవడం, మొక్కల కలుపు తీయకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామస్తులు కలెక్టర్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. డీపీఓ రవికుమర్, ఇఓఆర్‌డి కౌటిల్య, ఎండీఓ వాణీ, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.