రంగారెడ్డి

బోడుప్పల్ చెరువును సుందరంగా తీర్చిదిద్దాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, అక్టోబర్ 21: బోడుప్పల్ రాచెరువును సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను కార్మిక శాఖ మంత్రి సీహెచ్.మల్లారెడ్డి ఆదేశించారు. మున్సిపల్, ఇరిగేషన్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దశాబ్ధాల కాలంగా నాచారం, మల్లాపూర్ పారిశ్రామిక వాడల నుంచి కెమికల్ పరిశ్రమల నుంచి విషపూరితమైన రసాయనాలు, మురుగు నీరు చెరువులోకి చేరి పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు కలుషితమై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాలనీల మధ్య ఏరులై పారుతున్న మురుగు నీటి దుర్వాసనతో ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 43.23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు మురికి కూపంగా తయారై దుర్గందం వెదజల్లుతుందన్నారు. తక్షణమే అధికారులు సమన్వయంతో పని చేసి చెరువును శుభ్రం చేసి సుందరీకరణకు సంపూర్ణ సహాయం అందించాలన్నారు. కెమికల్ పరిశ్రమల నుంచి రసాయనాలను బయటకు రాకుండా ఎస్‌టీపీలను ఏర్పాటు చేసుకునేలా పారిశ్రామికవేత్తలకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పారు. సమావేశంలో కాలుష్య నియంత్రం మండలి వెంకట్, ఇరిగేషన్ డీఈ మంజుల, మున్సిపల్ కమిషనర్ శంకర్, డాక్టర్ భద్రా రెడ్డి, ప్రీతి రెడ్డి, రమణా రెడ్డి, గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.