రంగారెడ్డి

‘మన నగరం’ లో అందరూ భాగస్వాములు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, నవంబర్ 5: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన నగరం’ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పిలుపునిచ్చారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలో మన నగరం కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పనులను మంత్రి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంత్రి అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు. మంత్రి మాట్లాడుతూ మన నగరం ఒక మంచి కార్యక్రమమని ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికలాంటిదని వివరించారు. గ్రామాల్లో చేపట్టిన 30 రోజుల కార్యచరణ ప్రణాళిక అమలుతో పరిశుభ్రంగా మారాయని అదే స్ఫూర్తితో మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు కూడా గ్రామాలకు ధీటుగా అభివృద్ధి సాధించాలని సూచించారు. పార్టీలకలతీతంగా నాయకులు ఎమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారానికి నోచుకునే విధంగా చొరవచూపాలని చెప్పారు. మన నగరం కార్యక్రమంలో భాగంగా జీపీ పల్లి మున్సిపల్‌లో చేపట్టిన పనులపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. నీల చెరువు కట్టపై నిర్వహిస్తున్న పనులను మంత్రి మల్లారెడ్డి స్వయంగా పరిశీలించారు. మన నగరంలో భాగంగా జీపీ పల్లి మున్సిపల్ పరిధిలో వివిధ పనులను చేపట్టారు. పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాలు చేపట్టారు. పనులను కమిషనర్ అమరేందర్ రెడ్డి, మేనేజర్ చంద్రప్రకాశ్ రెడ్డి, ఇతర అధికారులు పర్యవేక్షించారు.
మేడ్చల్ మున్పిపల్ పరిధిలో
మన నగరం కార్యక్రమంలో భాగంగా మంగళవారం మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని పలు కాలనీలో పలు కార్యక్రమాలు చేపట్టారు. కిష్టాపూర్ రోడ్డులో ట్రాఫిక్‌కు అటంకంగా మారిన షెడ్డులను కమిషనర్ సత్యనారాయణ రెడ్డి దగ్గరుండి తొలగింపజేశారు. పలు కాలనీల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను, సీసీ రోడ్డు నిర్మాణ పనులను నిర్వహిస్తున్నారు. ఆయా కాలనీల్లో, రోడ్ల కిరువైపులా ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను జేసీబీ సహాయంతో తొలగించారు. పలు కాలనీలో వీధీ దీపాలను ఏర్పాటు చేశారు. మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేయడంతో పాటు కలుపు మొక్కలను తొలగించి గుంతలను తవ్వించారు. ఆయా కాలనీల్లో సమస్యలకు పరిష్కారం లభిస్తుండటంతో కాలనీవాసులు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.