రంగారెడ్డి

దూలపల్లి ప్రభుత్వ పాఠశాలకు చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, నవంబర్ 16: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గండిమైసమ్మ దుందిగల్ మండలం, దూలపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛంద సంస్థలు శనివారం సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఐ ఫౌండేషన్ మరియు ఐనోప్సీస్ (ఎస్‌వైఎన్‌ఓపీఎస్‌వైఎస్) సంస్థ సభ్యులు సుమారు 75 మంది వాలంటీర్లు రూ.10 లక్షలను వెచ్చించి పాఠశాల భవనానికి పెయింటింగ్, తరగతి గదుల గోడల రిపేర్, బెంచీల రిపేర్ మరియు 220 మంది బాలికలకు శానిటేషన్ నాప్కిన్‌లు, డిస్పోసిల్ కోసం రెండు మిషన్‌లు సేట్‌లను అందజేశారు. భవిష్యత్తులో బాలికల కొరకు ఇతర ఎలాంటి అవసరాలున్నా స్పందిస్తామని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. విద్యార్థులలో శాస్ర్తియ ధృక్పథాన్ని పెంపొందించడానికి అగస్థ్య మొబైల్ ల్యాబ్‌ని తీసుకువచ్చి విద్యార్థులకు వివిధ సైన్స్ ఎగ్జిబిషన్‌ని ప్రదర్శించి వివరించారు. పదోతరగతి విద్యార్థులకు రెండు సంవత్సరాల పాటు వివిధ అంశాలకు సంబంధించిన విలువైన అంశాలను వాలంటీర్లు బొధించడం జరిగింది. పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలను తెలిపారు.
మూడు మొక్కలు నాటాలి
షాద్‌నగర్ రూరల్, నవంబర్ 16: భావితరాల ప్రజలు సంతోషంగా ఉండాలంటే ప్రతి వ్యక్తి మూడు మొక్కలు నాటాలని షాద్‌నగర్ ఆర్డీవో ఎం.కృష్ణ సూచించారు. శనివారం స్థానిక ఆర్డీవో కార్యాలయం ఆవరణలో షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ విసిరిన గ్రీన్ చాలెంజ్‌ను స్థానిక ఆర్డీవో స్వీకరించి మొక్కలు నాటారు. మనిషికి కష్టం ఎదురైనప్పుడు ప్రాణవాయువును అందించే ప్రకృతి మద్య గడిపితే నూరేళ్ల పాటు అనందంగా ఉంటారని అన్నారు. గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా కొందుర్గు, జిల్లేడ్ చౌదరిగూడ, కేశంపేట తహశీల్దార్‌లకు గ్రీన్ చాలెంజ్ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ వెంకట్‌రాంరెడ్డి, సీనియర్ అసిస్టెంట్లు వెంకట్‌రెడ్డి, కీర్తిసాగర్, రాజు, మహేష్, హెచ్‌హెచ్‌పీ రాఘవేందర్‌రెడ్డి, జూనియర్ అసిస్టెంట్లు రాజేష్, సరస్వతి, ఒఎస్‌లు పాల్గొన్నారు.