రంగారెడ్డి

చిత్తశుద్ధితో జనాభా లెక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, నవంబర్ 19: జనాభా లెక్కల కార్యక్రమంలో అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని జిల్లా కలెక్టర్ అయిశ మస్రత్ ఖానమ్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో తహశీల్దార్లు, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లు, ఏఎస్‌ఓలతో జనాభా గణనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధులు నిర్వహించిన మాదిరి జనాభా గణన నిర్వహించాలని తెలిపారు. జనాభా లెక్కలను ఆన్‌లైన్‌లో పొందు పర్చాలని సూచించారు. కొత్త తండాలు, గ్రామాల్లో వివరాలు సరిగ్గా నిర్వహించాలని తెలిపారు. డీఆర్‌డీఏ పీడీ, జిల్లా వ్యవసాయశాఖ అధికారితో జనాభా లెక్కలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో జేసీ అరుణ కుమారి, జడ్పీ సీఈఓ శ్రీకాంత్ రెడ్డి, డీఆర్‌డీఓ జాన్సన్, తాండూరు ఆర్డీఓ వేణుమాధవ రావు ఉన్నారు.