రంగారెడ్డి

ఏనోట విన్నా..ఎన్‌కౌంటర్ చర్చలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, డిసెంబర్ 10: జస్టిస్ ఫర్ దిశ నిందితుల ఎన్‌కౌంటర్ చర్చలు జోరందుకున్నాయి. ఏనోట విన్నా..ఎన్‌కౌంటర్ చర్చలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎన్‌కౌంటర్ భయం నుంచి పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తెరుకొలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో రాత్రి సమయాల్లో తొమ్మిది గంటలు దాటిందంటే చాలు ఇళ్ల నుంచి బయటకు రాకపోవడమే కాకుండా ప్రధాన రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రధాన రహదారులు ఎప్పుడు జనంతో కిక్కిరిసి ఉండే మొయిన్‌రోడ్డు, గంజ్, కాలేజీరోడ్డు, పద్మావతి కాలనీ, పరిగి రోడ్డు, హాజిపల్లిరోడ్డు, నాగులపల్లి రోడ్డులలో రాత్రి తొమ్మిది గంటలు దాటితే జనం కనిపించడం లేదు. ఎప్పుడు ఏ సమయంలో ఏమి జరుగుతుందోనని ప్రజలు త్వరగా ఇళ్లకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో వ్యాపార వర్గాల వాళ్లు సైతం త్వరగా షాపులను బంద్ చేసి ఇళ్లకు పరుగులు తీస్తున్నారు. జస్టిస్ ఫర్ దిశ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ఎలాంటి వార్తలు వస్తాయోనని టివీల్లో నిమగ్నమవుతున్నారు. తెల్లవారితే చాలు నలుగురు వ్యక్తులు కలిస్తే దిశ నిందితుల ఎన్‌కౌంటర్ విషయాలే ఎక్కువగా చర్చకు వస్తుంటాయి. చిన్న, పెద్ద అనే భేదం లేకుండానే దిశ నిందితుల ఎన్‌కౌంటర్ విషయాలు చర్చలకు రావడం..దాంతో ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించడం ప్రజలు పనిగా పెట్టుకున్నారని చెప్పవచ్చు. 44వ జాతీయ రహదారి బైపాస్‌పై ఉన్న హోటళ్లు, దాబాల వద్ద పరిస్థితి ఇదే రకంగా కొనసాగుతుంది. బైపాస్ రహదారిపై మద్యరాత్రి వరకు కొనసాగే హోటళ్లు సైతం త్వరగా మూతపడుతున్నాయి. అంటే ఏ స్థాయిలో పట్టణ ప్రజల్లో ఎన్‌కౌంటర్ భయం పుట్టుకుందో తెలుస్తొంది. ఏది ఎమైనప్పటికి ఎన్‌కౌంటర్లకు షాద్‌నగర్ అడ్రస్‌గా మారడం..ప్రజలకు చర్చించుకోవడం ఓ పనిగా అయిపొయిందని చెప్పవచ్చు.