రంగారెడ్డి

అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, డిసెంబర్ 14: అభివృద్ధే పరమావధిగా ముందుకు వెళ్తున్నామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేక్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం డివిజన్‌లోని హెచ్‌ఏఎల్‌లో రూ.83 లక్షలతో, ఉషోదయకాలనీ ఫేజ్-1లో రూ.26 లక్షలతో, ప్రకాశం పంతులు నగర్‌లో రూ.28.10 లక్షలతో, బాలాజీ లే ఔట్ కాలనీలో రూ.25 లక్షలతో, నర్సింహ బస్తీ, మల్లారెడ్డినగర్‌లలో రూ.27.50 లక్షలతో సిమెంటు రోడ్డు పనులను ఎమ్మెల్సీ శంబీపూర్ రాజుతో కలిసి ఎమ్మెల్యే వివేక్ ప్రారంభించారు. వివేక్, రాజు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వౌలిక వసతులను కల్పించడమే తమ బాధ్యత అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌లు రావుల శేషగిరి, జగన్, సత్యనారాయణ, నాయకులు మసూద్, లాల్‌మహ్మద్, సురేశ్, మంజుల, ఇంద్రసేనా గుప్త, హుస్సేన్, సాయిప్రతాప్, రషీద్ బేగ్, నవాబ్, శ్రీనివాస్ యాదవ్, రావుల పృద్వీ, కమలాకర్, లక్ష్మన్, ఆబిద్ పాల్గొన్నారు.
గాజులరామారంలో పర్యటించిన ఎమ్మెల్యే
గాజులరామారం డివిజన్ దేవెందర్‌నగర్, నర్సింహ బస్తీలలో ఎమ్మెల్యే కేపీ వివేక్ పాదయాత్ర చేశారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. మహదేవపురంలోని రాఘవేంద్ర స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్ పూజలు చేశారు. దేవెందర్‌నగర్‌లో సిటిజన్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే వివేక్ ప్రారంభించారు. బతుకమ్మ బండలోని చర్చిలో క్రైస్తవులకు క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్‌లను ఎమ్మెల్యే వివేక్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల శేషగిరి, తెరాస నాయకులు, కాలనీల ప్రజలు పాల్గొన్నారు.