రంగారెడ్డి

బీజేపీతోనే సుస్ధిర పాలన సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, జనవరి 18: బీజేపీతోనే సుస్ధిర పాలన సాధ్యమని కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం దమ్మాయిగూడ, నాగారం మున్సిపాలిటీల్లో కిషన్ రెడ్డి రోడ్‌షో నిర్వహించారు. బీజేపీ బలపర్చిన అభ్యర్ధులనే గెలిపించాలని కోరారు. టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు నేడు టిక్కెట్‌లను అమ్ముకున్నారని, అలాంటి అభ్యర్లుకు ఓటు వేస్తే ఎలాంటి పరినామాలు ఉంటాయో తెలుసుకోవాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని, నరేంద్ర మోదీ అమలు చేస్తున్న అభివృద్ధి పనులే అభ్యర్ధులను గెలిపిస్తాయని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచందర్ రావు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొంపల్లి మోహన్ రెడ్డి, నాయకులు కందాడి సత్తిరెడ్డి, జిల్లాల తిరుమల్ రెడ్డి, లక్కాకుల మమత సురేశ్ పాల్గొన్నారు.
నార్సింగి: బండ్లగూడ కార్పొరేషన్ అభివృద్ధికి ప్రజలు బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి సత్తాచాటాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ వెల్లడించారు. శనివారం బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీజేపీ అభ్యర్థులతో కలిసి రోడ్‌షో నిర్వమించారు. బండ్లగూడ కిస్మత్‌పూర్, హైదర్షాకోట్, హిమాయత్‌సాగర్, పీరంచెరువులలో జోరుగా ప్రచారంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతోనే కార్పొరేషన్ అభివృద్ధి సాధ్యమని అన్నారు.
బాలాపూర్: మున్సిపల్ ఎన్నికలో బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించి, బడంగ్‌పేట్, మీర్‌పేట్ కార్పొరేషన్లపై బీజేపీ జెండా ఎగురవేస్తే కేంద్రం నుంచి రూ.100 వంద కోట్ల నిధులు మంజూరు చేయించే బాధ్యత తనదేనని రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ఎన్నిల ప్రచారంలో భాగంగా శనివారం మీర్‌పేట్, బడంగ్‌పేట్ కార్పొరేషన్లలో పర్యటించి, బీజేపీకి ఓట్లు వేయాలని ప్రచారం నిర్వహించారు. లక్ష్మణ్ మాట్లాడుతూ మున్సిపాలిటిల అభివృద్ధికి కేంద్రం నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం ఇవ్వలేదని అన్నారు. మీర్‌పేట్, బడంగ్‌పేట్ కార్పొరేషన్లలో బీజేపీ జెండా ఎగురవేస్తే ఒక్కో కార్పొరేషన్‌కు రూ.100 వంద కోట్ల నిధులు తీసుకువస్తానని హమీ ఇచ్చారు. టీఆర్‌ఎస్ నాయకులు చెప్పే మాయ మాటలు నమ్మకూడదని, ఎలాంటి అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం ఏదని నిలదీశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహా రెడ్డి, చెవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి బెక్కరి జనార్ధన్ రెడ్డి, మహేశ్వరం అసెంబ్లీ బీజేపీ ఇన్‌చార్జి అందెల శ్రీరాములు యాదవ్, సామ రంగారెడ్డి, వీరేందర్ గౌడ్, మీర్‌పేట్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు పెండ్యాల నర్సింహ, ధీరజ్ రెడ్డి పాల్గొన్నారు.
శామీర్‌పేట: ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసేందుకు కృషి చేస్తానని జవహర్‌నగర్ నగర్ మున్సిపాలిటీ 1వ వార్డు బీజేపీ అభ్యర్థులు వేపుల సన్నీ, 6వ వార్డు అభ్యర్థి అనీల్ కుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జవహర్‌నగర్, బీజేఆర్ నగర్, బాలాజీనగర్ ప్రాంతాల్లో కేంద్ర మంత్రి జీ.కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఒకటవ వార్డు అభ్యర్థి వేపుల సన్నీ, 6వ వార్డు అభ్యర్థి అనీల్ కుమార్ పాదయాత్ర చేశారు.