రంగారెడ్డి

ఇదిగో పులి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, జనవర్ 20: ఇంటిపై పడుకుని మంచిగా సేద తీరుతున్న చిరుత పులిని చూసి జనం సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అది చిరుత పులేనా అని అయోమయంలో పడ్డ ప్రజలు చివరకు దానిని చూసి ఆందోళనకు గురయ్యారు. సోమవారం షాద్‌నగర్ పట్టణంలోని మనె్న విజయ్ కుమార్ ఇంటిపై నిద్రిస్తున్న చిరుత పులిని చూసి ప్రజలు పోలీసులు, అటవీ అధికారులకు సమాచారం అందచేశారు. సమాచారం అందుకున్న షాద్‌నగర్ ఏసీపీ సురేందర్, సీఐ శ్రీ్ధర్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు పులి నిద్రిస్తున్న ఇంటి సమీపంలోకి ఎవరికి రానివ్వకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి అటవీ శాఖ అధికారులు వచ్చి చిరుత పులి ఉన్న ఇంటిలోకి ప్రవేశించి మత్తు ఇంజక్షన్ ఇచ్చే వరకు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. పులి కూడా నిద్రిస్తూ రెండు గంటల పాటు కదలకుండా ఉండటంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించ లేదు. చిరుత పులి ఉందనే విషయాన్ని తెలుసుకున్న చుట్టుపక్కల ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు రాలేదు. భయం గుప్పిట్లో పటేల్ రోడ్డు ప్రజలు ఇళ్ల లోనే ఉండిపోయారు. ఏ క్షణంలో ఎటు వైపు నుంచి చిరుత వస్తుందోననే భయంతో బయటకు రాకుండా పోయారు. చిరుత ఉందనే సమాచారంతో తెలుసుకున్న స్థానిక ప్రజలు తండోప తండాలుగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రజలు ఒక్కసారిగా ఘటన స్థలానికి చేరుకోవడంతో ఆ ప్రాంతం జనసంద్రంగా మారిపోయింది. అటవీ శాఖ అధికారి బీమా నాయక్ ఆధ్వర్యంలో సిబ్బంది చేరుకొని చిరుతకు మత్తు ఇంజక్షన్ ఇవ్వడంతో ఒక్కసారిగా పరుగు లంగించుకుంది. పడుకున్న ఇంటి నుంచి కొద్ది దూరంలో ఉన్న మార్కెట్ యార్డు వరకు అధికారులను పరుగులు పెట్టించి పడిపోయింది. వెంటనే అధికారులు గోనె సంచీని తీసుకుని చిరుత మొహాన్ని కప్పి బోనులోకి తరలించారు. చిరుత పులిని అంబులెన్సులోకి తరలించారు. ఆ తరువాత చిరుతను జూపార్కుకు తరలించడంతో ప్రజలు హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు.
చిరుత ఎలా వచ్చింది?
అడవిలో ఉండాల్సిన చిరుత పులి ఇళ్ల మధ్యకు ఎలా వచ్చిందనే విషయం చర్చనీయాంశమైంది. పట్టణ ప్రాంతానికి ఐదు కిలో మీటర్ల దూరంలో అటవీ ప్రాంతం ఉంది. పట్టణానికి, అటవీ ప్రాంతానికి మధ్యలో 44వ జాతీయ రహదారి, రైల్వే ట్రాక్ ఉంది. నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు కొనసాగిస్తుంటాయి. కమ్మదనం అటవీ ప్రాంతం నుంచి బైపాస్ మీదుగా రైల్వే పట్టాలు దాటుకుంటూ సమీపంలో ఉన్న మనే్న విజయ్ కుమార్ అనే వ్యక్తి ఇంటిపైకి తెల్లవారుఝామున వచ్చి ఉండవచ్చని చర్చించుకుంటున్నారు.