రంగారెడ్డి

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, షాద్‌నగర్, మేడ్చల్, కీసర, వికారాబాద్: మున్సిపాలిటీ ఎన్నికలు బుధవారం జరుగనుండటంతో మంగళవారం అధికారులు సర్వం సిద్ధం చేశారు. రంగారెడ్డి , మేడ్చల్, వికారాబాద్ పట్టణంలోని పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్స్‌లను పంపిణీ చేశారు. అనంతరం పోలీసు బందోబస్తుతో పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని తరలించారు. రంగారెడ్డి జిల్లాలో మూడు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కలెక్టర్ హరీష్ తెలిపారు. వికారాబాద్‌లో కలెక్టర్ అయిశ, ఎన్నికల పరిశీలకురాలు హైమావతి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రతి ఒక్కరూ విధిగా తమ ఓటుహక్కును వినియోగించు కోవాలని మేడ్చల్ కలెక్టర్ ఎంవీ రెడ్డి పేర్కొన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఓటు హక్కును వినియోగించుకుని పోలింగ్ శాతాన్ని పెంచాలని కోరారు. షాద్‌నగర్ మున్సిపల్ పరిధిలోని 28వార్డుల్లో 59 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 59 పోలింగ్ కేంద్రాలను 14 రూట్లుగా విభజించారు. ఒక్కో రూట్‌కు ఒక జోనల్ ఆఫీసర్‌ను ఏర్పాటు చేశారు. 14 రూట్లకు 14 మంది జోనర్ ఆఫీసర్లను నియమించినట్లు ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారి శరత్‌చంద్ర తెలిపారు. ఎన్నికల పోలింగ్‌ను పురస్కరించుకుని భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు షాద్‌నగర్ ఏసీపీ పీ.సురేందర్ తెలిపారు.