రంగారెడ్డి

మేడ్చల్ సహకార సంఘం చైర్మన్‌గా రణదీప్ రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఫిబ్రవరి 16: మేడ్చల్ మండలంలో మేడ్చల్, డబిల్‌పూర్, పూడూరు సహకార సంఘాల చైర్మన్, వైస్‌చైర్మన్‌ల ఎన్నిక ఆదివారం ప్రశాంతంగా జరిగింది. మేడ్చల్ సహకార సంఘం చైర్మన్ 6వ వార్డు డైరెక్టర్ గౌడవెళ్లి గ్రామానికి చెందిన సింగిరెడ్డి రణదీప్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం సహకార సంఘాల ఎన్నికలు, ఫలితాలు వెల్లడించిన తర్వాత విజయం సాధించిన అభ్యర్థులు శిబిరానికి తరలివెళ్లారు. ఆదివారం ఉదయం 10-30 గంటలకు నేరుగా గెలుపొందిన అభ్యర్థులు మేడ్చల్ పీఏసీఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. చైర్మన్‌గా గౌడవెళ్లి గ్రామానికి చెందిన రణదీప్ రెడ్డి ఒకే ఒక నామినేషన్ దాఖలు చేయడంతో సమయం ముగిసిన తర్వాత ఎన్నికల అధికారులు చైర్మన్‌గా రణదీప్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.
టీఆర్‌ఎస్ నాయకులు శేఖర్ గౌడ్, నర్సింహా రెడ్డి, మోహన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, జకట దేవ, శ్రావణ్, జగన్ రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాస్కర్ యాదవ్.. మేడ్చల్ పీఏసీఎస్ చైర్మన్ ఎన్నిక పూర్తయ్యే వరకు సొసైటీ వద్ద మంతనాలు నిర్వహించారు. మంత్రి మల్లారెడ్డి ఆదేశాల మేరకు దివంగత నాయకులు సురేందర్ రెడ్డి కుమారుడు రణదీప్ రెడ్డి సోసైటీ చైర్మన్‌గా ఎన్నికయ్యేంత వరకు ప్రయత్నాలు ముమ్మరంగా చేశారు. వైస్‌చైర్మన్‌గా కండ్లకోయకు చెందిన దామన్నగారి నరహరి ఎన్నికయ్యారు.
డబిల్‌పూర్ సహకార సంఘం చైర్మన్‌గా నూతన్‌కల్ గ్రామానికి చెందిన 10వ వార్డు సభ్యుడు సద్ది సురేశ్ కుమార్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్‌చైర్మన్‌గా గోపని వెంకటేశ్ ఎన్నికయ్యారు. పూడూరు సోసైటీ చైర్మన్‌గా 1వ వార్డు డైరెక్టర్ నల్లబాపని సుధాకర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా 7వ వార్డు డైరెక్టర్ లావుడ్యా శ్యాంలాల్ ఎన్నికయ్యారు. మేడ్చల్ సోసైటీ చైర్మన్, వైస్‌చైర్మన్‌లుగా ఏకగ్రీవంగా ఎన్నికైనందున బహుజన సాహిత్య అకాడమి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ పూజారి ఘనంగా సన్మానించారు.
నార్సింగి సహకార సంఘం చైర్మన్‌గా సంజీవ రెడ్డి
నార్సింగి: నార్సింగి వ్యవసాయ సహకార సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఆదివారం చైర్మన్, వైస్ చైర్మన్‌లను ఎన్నుకున్నారు. చైర్మన్‌గా కాంగ్రెస్ అభ్యర్థి సంజీవ రెడ్డి.. టీఆర్‌ఎస్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డిపై రెండు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సంజీవ రెడ్డికి ఏడు ఓట్లు రాగా, విష్ణువర్దన్ రెడ్డికి ఐదు ఓట్లు వచ్చాయి. చైర్మన్‌గా కాంగ్రెస్ అభ్యర్థి సంజీవ రెడ్డి నిలిచారు. నార్సింగి వైస్ చైర్మన్‌గా బీజేపీ అభ్యర్థి సత్యనారాయణ విజయం సాధించారు.
హైదర్షాకోట్ సహకారం సంఘం టీఆర్‌ఎస్ కైవసం
హైదర్షాకోట్ వ్యవసాయ సహకార సంఘం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. చైర్మన్‌గా బీ.రామ్‌దాస్ ముదిరాజ్‌కు ఆరు ఓట్లు రాగా, భూపాల్ రెడ్డికి ఐదు ఓట్లు వచ్చాయి. ఒక ఓటు చెల్లకుండా పోయింది. రామ్‌దాస్ ముదిరాజ్‌ను చైర్మన్‌గా ఎన్నికైనట్లు ప్రకటించారు. వైస్ చైర్మన్‌గా ఈ.ప్రతాప్‌రెడ్డి ఒక్కరే నామినేషన్‌లు దాఖలు చేయడంతో ఏకగ్రీవం అయింది.
బుయ్యని మనోహర రెడ్డి ఏకగ్రీవం
కులకచర్ల: ప్రాథమిక సహాకార సంఘం కులకచర్ల ఛైర్మన్‌గా మండల మాజీ జడ్పీటీసీ బుయ్యని మనోహర రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఆదివారం కులకచర్లలో జరిగిన ఎన్నికల్లో ఛైర్మన్ పదవికి బుయ్యని మనోహర రెడ్డి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అనంతరం ఉపాధ్యక్ష పదవికి మాజీ సర్పంచి, గతంలోనూ పీఏసీఎస్ డైరెక్టర్‌గా పనిచేసిన మందిపాల్ నాగరాజును ఎన్నుకున్నారు.
డీసీసీబీ ఛైర్మన్‌గా మనోహర రెడ్డి?
కులకచర్ల ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన బుయ్యని మనోహర రెడ్డిని పార్టీ అధిష్ఠానం డీసీసీబీ చైర్మన్‌గా ఎంపిక చేసినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లా మంత్రి సబితారెడ్డితోపాటు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మహేశ్ రెడ్డి, రోహిత్ రెడ్డితో తత్సంబంధాలున్న కారణంగా ఎన్నిక లాంఛనప్రాయమేనని తెలిసింది.