రంగారెడ్డి

దేశాన్ని రక్షించుకునే బాధ్యతతో ప్రజా సేవ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, ఫిబ్రవరి 22: మన దేశాన్ని నిర్మించుకుని రక్షించుకునే బాధ్యతతో ప్రజా సేవ చేయాలని సీబీఐ సంస్థ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీ నారాయణ యువతకు పిలుపునిచ్చారు. బాచుపల్లిలోని వీఎన్‌ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో యూత్ పార్లమెంట్ ఆధ్వర్యంలో లీడర్ షిప్ బూట్ క్యాంప్ జరిగింది. వేదిక పై పార్లమెంట్ సభ్యులు లావు శ్రీ కృష్ణదేవరాయలు, గీతమ్ విద్యా సంస్థల అధ్యక్షు డు ఎమ్.భరత్ రాజకీయాల్లో యువత పాత్ర గురించి ఉత్తమ రైతు పురస్కార గ్రహీత లక్ష్మీనర్సింహ చర్చలో పాల్గొన్నారు. కార్యక్రమంలో విజ్ఞాన్ జ్యోతి సంస్థ అధ్యక్షుడు డాక్టర్ డీఎన్ రావు, అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సుంకు బాలచంద్ర, విశ్రాంత ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్సీ ఆచార్య కే.నాగేశ్వర్ పాల్గొన్నారు. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రజల హక్కులను పరిరక్షించే వివిధ వ్యవస్థల గురించి వివరిస్తూ స్వయంప్రతిపత్తి గల ఈ వ్యవస్థలను కాపాడుకోవడానికి రాజ్యాంగం కల్పించిన రక్షణను విశదీకరిస్తూ వాటిని కాపాడుకోవాలని యువతకు సూచించారు. రాజ్యాంగంలోని పీఠికలో వివరించిన విధంగా మన దేశాన్ని నిర్మించుకుని రక్షించుకునే బాధ్యతతో ప్రజాసేవ చేయాలని పిలుపునిచ్చారు. డీఎన్ రా వు, సుంకు బాలచంద్ర మాట్లాడుతూ ప్రాచీన భారతీయ వేదాంతం, పరిజ్ఞానము నేటికీ ముఖ్యమని, నేటి యువత నాయకత్వ లక్షణాలను అలవరుచుకునే క్రమంలో విజయం, సంతోషం, శాంతి, సంపూర్ణత్వం ఎలా సాధించాలో ‘అసతో మా సద్గమయ’ అన్న శాంతి మంత్రం వంటి తరతరాల విజ్ఞానం మనకు నేర్పుతుందని గుర్తుచేశారు. హనుమంతుడి వంటి సేవాథృక్పధముంటే తప్ప నాయకులు కాలేరని, శ్రీరాముడంతటి వాడైనా హనుమంతుని సాయం తీసుకున్నాడని వివరించారు. వ్యక్తిత్వం, కుటుంబం, వృత్తి, సమాజం, ఆధ్యాత్మికత అన్న ఐదు విషయాల్లో అత్యుత్తమ స్థాయి ఉంటే తప్ప నాయకత్వంలో రాణించలేరని అభిప్రాయపడ్డారు. కళాశాల ప్రధానాధ్యాపకులు డాక్టర్ సీడీ నాయుడు, సంచాలకులు చెన్నకేశవ రావు, వీఎన్‌ఆర్ స్టూడెంట్ ఫోర్స్ కే.పద్మజ, చక్రవర్తుల కిరణ్ పాల్గొన్నారు.