రంగారెడ్డి

మార్చి15 లోపు డబుల్ ఇళ్లు కేటాయించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, ఫిబ్రవరి 25: ఎల్బీనగర్ నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మార్చి 15లోపు నిజమైన లబ్ధిదారులకు కేటాయించకుంటే కలెక్టర్ కార్యాలయం ముందు వంటా వార్పు, ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసెడెంట్ ఏ.రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం పట్టణ గోస కార్యక్రమంలో భాగంగా నాగోలు, వనస్థలిపురం డివిజన్‌లో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను సంబంధిత అధికారులతో కలసి సందర్శించారు. బండ్లగూడ, ఆనంద్ నగర్ చౌరస్తాలో ఉన్న రాజీవ్ స్వగృహ ఇళ్లను పరిశీలించారు. నివాసితులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాంచారమ్మ బస్తీ, వనస్థలిపురం రైతు బజార్ వద్ద నిర్మాణంలో ఉన్న ఇళ్ల పనులతో పాటు లబ్ధిదారులకు కేటాయింపులు ఎలా జరుగుతున్నాయని హౌసింగ్, మండల రెవెన్యూ అధికారులను వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల పట్టాలు రాని నిజమైన లబ్ధిదారులను కలసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నాంచారమ్మ కాలనీలో 286 మంది లబ్ధిదారులకు ఇళ్లను నిర్మించారని, అందులో 154 మంది లబ్ధిదారులను ముందుస్తుగా గుర్తించి వారికి తాళాలు ఇచ్చి వెంటనే గుంజుకున్నారని ఆరోపించారు. ఇళ్లు కేటాయించిన 154 మంది లబ్ధిదారులకు వెంటనే తాళాలు ఇచ్చి వారిని ఇంటి కిరాయి బారి నుంచి కాపాడాలని చెప్పారు. మంత్రి కేటీఆర్ నిర్లక్ష్యంతో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ప్రారంభానికి నోచుకోలేక పోతున్నాయని విమర్శించారు. పట్టణ ప్రగతి కార్యక్రమాలలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల గురించి కేటీఆర్ ఎందుకు మాట్లాడటం తేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.. ఇళ్ల రిజిస్ట్రేషన్‌ల సమస్యలు, అధికంగా పెరిగిన ఇంటి పన్నులను ఆరు నెలలలో తగ్గించకుంటే పదవికి రాజీనామా చేస్తానని ప్రజలకు చెప్పి అధికార పార్టీలో చేరాడని గుర్తు చేశారు. సంవత్సరం గడుస్తున్న సమస్యలు పరిష్కారం కాలేదని, సుధీర్ రెడ్డి మాత్రం కార్పొరేషన్ చైర్మన్ పదవిని దక్కించుకున్నారని అన్నారు.
సీఎం కేసీఆర్, కేటీఆర్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అవినీతిపై ఇంటింటికీ తిరుగుతూ నడి బజార్‌లో నిలబెడుతామని అన్నారు. రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డి, పటేల్ సుధాకర్ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శిలు జక్కిడి ప్రభాకర్ రెడ్డి, గజ్జి భాస్కర్ యాదవ్, పీసీసీ అధికార ప్రతి నిధి సామ రామ్మోహన్ రెడ్డి, సుధీర్ రెడ్డి, ఎల్బీనగర్ కాంగ్రెస్ నాయకులు కొప్పుల నర్సింహా రెడ్డి, బద్దుల వెంకటేష్ యాదవ్, మకటం సదాశివుడు, దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, ధన్ రాజు, సుజాతా రెడ్డి, గజ్జి శ్రీనివాస్ యాదవ్, రామకృష్ణా రెడ్డి పాల్గొన్నారు.