రంగారెడ్డి

చిన్నారి అపహరణ రూ.20 వేలకు విక్రయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, నవంబర్ 26 : ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ బాలుడిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లి విక్రయించిన ఓ మహిళను మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
చిన్నారి అదృశ్యాన్ని తట్టుకోలేకపోయిన తండ్రి గుండెపోటుతో మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. రాజేంద్రనగర్ ఏసిపి గంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని పురానాపూల్ ప్రాంతానికి చెందిన తుపాకుల నరేందర్ (35), మాలతీ భార్యభర్తలు. వీరికి నలుగురు సంతానం. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. చిన్నారి కుమారుడు నాగచైతన్య బతుకుదెరువు కోసం కుటుంబ సమేతంగా మైలార్‌దేవ్‌పల్లి వినాయక్‌నగర్‌కు వచ్చారు. పురానాపూల్‌లోని టైర్ల కంపెనీలో తండ్రి పని చేస్తున్నాడు.
శుక్రవారం రాత్రి 8.30 ప్రాంతంలో ఇంటి ముందు నాగచైతన్య ఆడుకుంటున్నాడు. బుద్వేల్ ప్రాంతానికి చెందిన కతావత్ కవిత(24) నాగచైతన్యను కిడ్నాప్ చేసి తీసుకెళ్లింది. కుమారుడు కనిపించకపోవడంతో వెంటనే అప్రమత్తమై బస్తీలో వెతికారు.
ఎక్కడా కనిపించకపోవడంతో రాత్రి 10.30 గంటల ప్రాంతంలో మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, కుమారుడి కిడ్నాప్‌తో తీవ్ర మనస్తాపానికి గురైన బాలుడి తండ్రి నరేందర్ గుండెపోటుతో శనివారం ఉదయం మృతి చెందాడు. కాగా, బాధితుల ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు విచారణ జరిపి మైలార్‌దేవ్‌పల్లిలోని మెహఫిల్ హోటల్ వద్ద ఉన్న ఫుటేజ్‌ను సేకరించారు. దాని ఆధారంగా అన్ని ప్రాంతాలను అప్రమత్తం చేసి బాబుల్‌రెడ్డినగర్‌లో ఆమెను పట్టుకున్నారు. అప్పటికే పురానాపూల్‌కు చెందిన ఆళ్లకుంట రాముకు రూ.20 వేలకు బాబును విక్రయించింది. రాముకు నలుగురు ఆడపిల్లలు కావడంతో బాబును కొనుగోలు చేసినట్లు తెలిపాడు. అడ్వాన్స్‌గా రూ.5 వేలను ఇచ్చి రూ.15 వేలను తరువాత ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. పోలీసులు రంగంలోకి దిగి 24 గంటల్లోనే కిడ్నాప్ కేసును ఛేదించి కవితను కతావత్ కవితను, రామును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కిడ్నాప్‌కు పాల్పడిన కవిత గత మూడేళ్ల క్రితం తన సొంత కుమారుడినే కర్నూల్‌లోని ఓ వ్యక్తికి అమ్మేసిందని పోలీసులు తెలిపారు. భర్త కోల్పోయిన మాలతీకి పోలీసు శాఖలో ఉద్యోగం కల్పిస్తానని సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్యా హామీ ఇచ్చారు.