రంగారెడ్డి

తాండూరు జాతీయ వ్యవసాయ మార్కెట్‌లో ఆన్‌లైన్ వ్యాపారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, నవంబర్ 26: తాండూరు జాతీయ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆన్‌లైన్ ద్వారా వ్యాపారాలు గత సెప్టెంబర్ మాసం నుండే ప్రారంభం అయినట్టు తాండూరు జాతీయ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. కాగా సెప్టెంబర్ 8నుంచి నవంబర్ 22 వరకు రైతులకు సంబంధించిన పంట దిగుబడులు 7.632 లాట్‌లు ఆన్‌లైన్‌లో ఎంట్రీ అయినట్టు కార్యదర్శి వివరించారు. ఆన్‌లైన్ వ్యాపారాలు మొదలయినప్పటి నుండి అన్ని రకాల పంటల దిగుబడులు కందులు, పెసలు, మినుములు, మొక్కజొన్న, సోయాబీన్, వరి ధాన్యం వంటి పంట దిగుబడులు మొత్తం 40.840 క్వింటాళ్లు క్రయవిక్రయ వ్యాపారాలు సాగినట్టు ఆయన తెలిపారు. ఇందులో మొత్తం రైతులు 7600 మంది తమ పంట దిగుబడులను తాండూరు మార్కెట్లో ఆన్‌లైన్ ద్వారా విక్రయించినట్టు చెప్పారు. కాగా ఇటీవల పెద్దనోట్ల రద్దు, నోట్ల మార్పువంటి ప్రక్రియల వల్ల తాండూరు మార్కెట్‌లో రైతులు ఎలాంటి ఇక్కట్ల పాలుకాలేదని మార్కెట్ కార్యదర్శి పేర్కొన్నారు.
తాండూరు జాతీయ వ్యవసాయ మార్కెట్ పరిధిలో రైతుబంధు పథకంలో అయిదు నుంచి ఆరువేల మంది వరకు రైతులు సభ్యులుగా ఉన్నట్టు తాండూరు వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. శనివారం ఆయన తన ఛాంబర్‌లో విలేఖరులతో మాట్లాడుతూ రైతుబంధు పథకం ద్వారా అందులో సభ్యులయిన రైతులకు తాము మార్కెట్‌కు తరలించిన పంట దిగుబడుల మొత్తం విలువలో 75 శాతం రుణంగా మార్కెట్ కమిటీ ద్వార చెల్లిస్తున్నట్టు చెప్పారు. కాగారాబోయే 3 నెలల పాటు తాము అందించే రుణాలపై వడ్డీ రాయితీ ఉంటుందని మార్కెట్ కార్యదర్శి వివరించారు. కాగా రైతుబంధు పథకం ద్వారా పెద్దనోట్ల రద్దు, నోట్ల మార్పు కష్టాల నుండి రైతులకు అవాంతరాలు ఎదురుకాకుండా మార్కెటింగ్ శాఖ ద్వారా చర్యలు చేపట్టినట్టు కార్యదర్శి పేర్కొన్నారు.
జోరుగా ధాన్యం క్రయవిక్రయాలు
తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో జోరుగా ధాన్యం క్రయవిక్రయాల వ్యాపారం కొనసాగుతోంది. నెల రోజుల క్రితం ప్రారంభం అయిన మొక్కజొన్న వ్యాపారాలు మార్కెట్లో కొనసాగుతుండగానే వరిధాన్యం సీజన్ ఊపందుకున్నట్టు స్థానిక మార్కెట్ యార్డు వ్యాపారులు, మార్కెటింగ్ శాఖ అధికారులు శనివారం వివరించారు. కాగా ప్రస్తుతం మార్కెట్లో మొక్కజొన్న క్వింటాలు ధర రూ 1300 నుండి రూ 1400 వరకు పలుకుతున్నట్టు వ్యాపార వర్గాలు వివరించాయి. అదేవిధంగా వర్షాకాలం వరిధాన్యం సీజన్ తాండూరు మార్కెట్‌లో మంచి ఊపుమీద కొనసాగుతోంది. మొక్కజొన్న పంట దిగుబడులు ప్రారంభం నుండి దాదాపు 8 నుంచి 10వేల క్వింటాళ్ళ వరకు మార్కెట్‌కు రాగా, పదిహేను రోజుల క్రితం ప్రారంభం అయిన వరిధాన్యం సీజన్‌కు ధాన్యం దిగుబడులు 15వేల క్వింటాళ్ల వరకు మార్కెట్‌లో క్రయవిక్రయాలు కొనసాగినట్టు మార్కెటింగ్ అధికారులు వివరించారు. కాగా వరి ధాన్యం హంస రకం క్వింటాలుకు రూ 15వందలు ఉండగా, మిగతా రకం వరిధాన్యం క్వింటాలుకు రూ 1210 కనిష్ట్ధర రూ 1310 వరకు గరిష్ట ధరలు కొనసాగుతున్నట్టు వ్యాపారులు పేర్కొంటున్నారు.
చిత్తశుద్ధితో రక్షిత మంచినీరు

కేంద్ర మంత్రి రమేష్
జిగాజినాగి
రాజేంద్రనగర్, నవంబర్ 26 : దేశ ప్రధాని నరేంద్రమోదీ రక్షిత మంచినీటిని అందించడంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని కేంద్ర గ్రామీణ నీటి పారుదల, శానిటేషన్ సహాయ మంత్రి రమేష్ జిగాజినాగి అన్నారు. శనివారం జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ (ఎన్‌ఐ ఆర్డీ)లో గ్రామీణ హస్తకళల మేళాను సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలోని 1,74,528 గ్రామాల్లో రక్షిత మంచినీటి సౌకర్యాన్ని కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రూ.2179 కోట్ల నిధులను రక్షిత మంచినీటికి కేటాయిచిందని వివరించారు. ఇప్పటికే 1,32,900 గ్రామాల్లో రక్షిత మంచినీటి సౌకర్యాన్ని కల్పించడం జరిగిందని, మరో 3,24,770 గ్రామాల్లో పనులు జరుగుతున్నాయని వివరించారు. 6,88,027 గ్రామాల్లో నీటి కాలుష్యం అవుతుందని గుర్తించారని, వాటికి కూడా త్వరలోనే రక్షిత మంచినీటిని కల్పిస్తామని తెలిపారు. స్వచ్ఛ భారత్‌లో గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని వివరించారు. 2.77 కోట్ల మరుగుదొడ్లు ఇప్పటికే మంజూరు చేసినట్టు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో స్వచ్చ భారత్ కార్యక్రమంలో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో వెనుకబడి పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యేడాది 98 శాతం మరుగుదొడ్ల నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తే తెలంగాణ ప్రభుత్వం 48 శాతమే వాడుకుందని తెలిపారు. గత యేడాది తెలంగాణకు మరుగుదొడ్ల నిర్మాణం కోసం రూ.160 కోట్లు కేటాయిస్తే రూ.87 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా ఖర్చు చేయలేదని విమర్శించారు. సాంకేతిక పరిజ్ఞానం, పర్యవేక్షణ నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుందని, దానిని రాష్ట్ర ప్రభుత్వం సరైన పద్ధతిలో వాడుకోవడంలో విఫలమైందన్నారు.

నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు
* శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ
శేరిలింగంపల్లి, నవంబర్ 26: వేసవిలో నీటిఎద్దడి రాకుండా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ జలమండలి అధికారులను ఆదేశించారు. శనివారం హఫీజ్‌పేటలోని చందానగర్ డివిజన్ కార్యాలయంలో జనరల్ మేనేజర్ వెంకటేశ్వరరావుతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న రిజర్వాయర్లు, పైపులైను పనులను సకాలంలో పూర్తి చేయాలని, అవసరమైన చోట మరమ్మతు పనులు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు. పైపులైను లేని ప్రాంతాలు, కలుషిత నీరు సరఫరా జరుగుతున్న ప్రాంతాలు, పైపులైన్లు మార్చాల్సిన ప్రాంతాలను గుర్తించి ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇంటింటికీ నల్లా పథకంలో భాగంగా తగిన ప్రణాళిక రూపొందించి, వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలియచేశారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రాజెక్ట్స్ డిజిఎం సత్యనారాయణ, చందానగర్ డిజిఎం రవీందర్, మేనేజర్లు నాగప్రియ, అధికారులు, మెగా ఇంజనీరింగ్ సంస్థ ఇంజనీర్లు పాల్గొన్నారు.