రంగారెడ్డి

హడలెత్తిస్తున్న సఫిల్‌గూడ రోడ్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మల్కాజిగిరి, నవంబర్ 27: మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని ప్రధాన రహదారైన ఆనంద్‌బాగ్ చౌరస్తా నుంచి వినాయకనగర్ చౌరస్తా వరకు గల రోడ్డు మార్గం ప్రయాణికులను, వాహనదారులను, పాదచారులను హడలెత్తిస్తోంది. మంచినీటి పైప్ లైన్ పనుల నిమిత్తం జరిపిన తవ్వకాల సమయంలో ఏర్పడ్డ గుంతలను కంకర పౌడర్, కంకర కలిపి గుంతలల్లో వేయటంతో వచ్చిపోయే వాహనాలతో దుమ్ము రేగుతోంది. ఈ దుమ్ము దాదాపు కిలోమీటర్ వరకు దుమ్ము కమ్ముకుంటుంది. ఈ మార్గంలో ప్రయాణించే వారికి రోడ్డు స్పష్టంగా కనబడటం లేదు. ప్రత్యామ్నాయ మార్గం లేక పోవటంతో తప్పనిసరిగా ఆనంద్‌బాగ్, సఫిల్‌గూడ, కృపాకాంప్లెక్స్, వినాయకనగర్ మీదుగానే ప్రయాణించాల్సి వస్తోందని వాహనదారులు పేర్కొంటున్నారు. మధ్య రాత్రి రెండు, మూడు గంటల మినహాయిస్తే మిగతా సమయమంతా దుమ్ముతో నిండి ఉంటుంది. భయంకరమైన దుమ్ముతో ప్రజలు తీవ్రంగా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అభివృద్ధి విషయంలో రోడ్ల తవ్వకాలు, పైప్‌లైన్ల నిర్మాణ పనులు చేయటం వంటి వాటిని ఎవ్వరు వ్యతిరేకించరుగాని ప్రజలకు కలిగే ఇబ్బందులను దృష్టిలో పెట్టులోని దానికనుగు చర్యలు తీసుకోవలసిన అధికారులు పూర్తి నిర్లక్ష్యం వహిస్తుండటంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు గత రెండేళ్లుగా ఎవరిని కదలించ లేకపోవటం నిజంగా తీవ్ర ఆవేదన కలిగించే విషయం. అసలే చలికాలం పైగ దుమ్ములో ప్రయాణించటం పట్ల శ్వాసకోస సమస్యలు, తీవ్రమైన దగ్గుతో ఇబ్బందులు పడుతున్నామని ఈ మార్గంలో ప్రయాణించే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గం గుండా ఉన్న నివాసితుల సమస్యలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇళ్లను దుమ్ము కమ్మేస్తుంది. దీంతో తాము నివసిస్తున్నది ఇంట్లోనా లేక రోడ్డుపైనా అనే సందేహం కలుగుతోందని వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తమ సమస్యను ప్రజాప్రతినిధులు, అధికారులు పరిష్కరించటం లేదని వాపోతున్నారు. ఇక రోడ్డు పక్కన షాపులు, వ్యాపారాలు నిర్వహించే వారైతే తమ ఆరోగ్య విషయంలో తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి వారు చేస్తున్న చర్యలపై వారు ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరటం తప్ప తాము చేసేది ఏమిలేదని తీవ్ర నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు.
వాటర్ ట్యాంకర్‌తో నీటిని చల్లించండి
రోడ్డు వేయటం మాటా అటుంచితే కనీసం ఆనంద్‌బాగ్ నుంచి వినాయకనగర్ వరకు దుమ్ముతో నిండిన రోడ్డు మార్గంలో రెండు వాటర్ ట్యాంకర్‌లను ఏర్పాటు చేసి నీటిని చల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నిరంతరం నీటిని చల్లించటంతో దుమ్ము రేగకుండా వుండవచ్చని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈరోడ్డు మార్గం విషయంలో స్పష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాంక్‌బండ్‌కు పెరిగిన సందర్శకుల తాకిడి

లవ్ హైదరాబాద్ స్పాట్ వద్ద టూరిస్టుల సందడి

ఖైరతాబాద్, నవంబర్ 27: పెద్ద నోట్ల రద్దుతో కొంత కాలంగా సందర్శకులు లేక వెలవెలబోయిన ట్యాంక్‌బండ్ ఆదివారం సందర్శకులతో కిటకిటలాడింది. ఈనెల 8న ప్రధాని నరేంద్ర మోది రూ. 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు నిర్ణయం వెల్లడించిన మరుసటి రోజు నుంచి ట్యాంక్‌బండ్‌తో పాటు నక్లెస్‌రోడ్, లుంబిని పార్క్, ఎన్‌టిఆర్ పార్క్‌లకు సందర్శకుల తాకిడి తగ్గింది. నగరానికి వచ్చే పర్యాటకుల సంఖ్య భారీగా పడిపోపోయింది.