రంగారెడ్డి

బాచుపల్లి మండల రెవెన్యూ యంత్రాంగంపై జెసి ధ్వజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, నవంబర్ 29: బాచుపల్లి మండల రెవెన్యూ యంత్రాంగంపై మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్ ధర్మారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సర్ట్ఫికెట్‌ల జారీలో జాప్యం జరగడంతో పాటు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయని మండిపడ్డారు. మంగళవారం బాచుపల్లి మండల రెవెన్యూ కార్యాలయాన్ని జెసి ధర్మారెడ్డి తనిఖీ చేశారు. కార్యాలయంలో జీవో 92, 58, 59ల దరఖాస్తుల స్టేటస్‌ను అడిగి తెలుసుకున్నారు. కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. కార్యాలయంలో సిస్టమ్‌లు, ఫర్నీచర్, సిబ్బంది కొరతపై తహశీల్దార్ సరళను అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత కుల, ఆదాయ, రెసిడెన్సీ, స్థల సర్వేలు, జనన ధృవీకరణ పత్రాల లిస్ట్‌ను కంప్యూటర్ నుండి తీయించి పరిశీలించారు. స్థల సర్వేల దరఖాస్తులు 40 పెండింగ్‌లో ఎందుకు ఉన్నాయని సర్వేయర్ శ్రీనాథ్‌ను జెసి ప్రశ్నించారు. దీనికి సంబంధించిన రిజిస్టర్‌ను తీసుకుని కార్యాలయానికి రావాలని ఆదేశించారు. కుల, ఆదాయ, రెసిడెన్సీ, జనన ధ్రువీకరణ పత్రాలు పెండింగ్‌లో ఎందుకు ఉన్నాయని తహశీల్దార్, ఆర్‌ఐలను అడగగా సరైన సమాధానం చెప్పలేకపోయారు. మీ-సేవ నుండి తమకు దరఖాస్తులు అందడం లేవని సమాధానమిచ్చారు. మీ-సేవ నుండి దరఖాస్తులు ఇవ్వని పక్షంలో మీ-సేవను రద్దు చేయాలని ఆదేశించారు. మండల పనితీరుపై జేసి ధర్మారెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వెళ్లిపోయారు. మళ్లీ వచ్చే వారం విజిట్ చేస్తానని రెవెన్యూ సిబ్బందికి చెప్పినట్లు సమాచారం.
జగద్గిరిగుట్టలో పిఎస్ స్థలాన్ని
పరిశీలించిన జెసి
జగద్గిరిగుట్టలోని సర్వేనంబరు 348/1లో పోలీస్‌స్టేషన్‌కు కేటాయించిన స్థలాన్ని మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్ ధర్మారెడ్డి, కుత్బుల్లాపూర్ మండల తహశీల్దార్ ఇలియాస్, సిఐ శ్రీనివాస్‌లతో కలిసి పరిశీలించారు. పిఎస్‌కు కేటాయించిన స్థల హద్దులను సర్వేయర్‌ను అడిగి తెలుసుకున్నారు. వెంటనే సర్వేను పూర్తి చేసి హద్దురాళ్లను ఏర్పాటు చేసి నివేదికను సమర్పించాలని సర్వేయర్‌ను జేసి ఆదేశించారు.